తెలంగాణ‌లో మినీ పుర పోరులో అధికార టీఆర్ఎస్ పార్టీ దూసుకు పోతోంది.  కొత్తూరు మున్సిపాలిటీలోని మొత్తం 12 వార్డుల‌కుగాను టీఆర్ఎస్‌ 7 వార్డుల‌ను కైవ‌సం చేసుకుని జ‌య‌కేత‌నం ఎగుర‌వేసింది. ఐదు వార్డుల్లో కాంగ్రెస్ అభ్య‌ర్థులు గెలుపొందారు. జ‌డ్చ‌ర్ల మున్సిపాలిటీ ప‌రిధిలో మొత్తం 27 వార్డుల్లో టీఆర్ఎస్ 23 స్థానాలను కైవ‌సం చేసుకుంది.కొత్తూరు, జ‌డ్చ‌ర్ల‌ మున్సిపాలిటీలో టీఆర్ఎస్ పార్టీకి ఘ‌న విజ‌యం అందించిన ఓట‌ర్ల‌కు మంత్రి వి. శ్రీ‌నివాస్ గౌడ్ కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ట్విట్ట‌ర్ ద్వారా మంత్రి స్పందిస్తూ.. పార్టీకి విజ‌యం అందించిన ఓట‌ర్ల‌కు ధ‌న్య‌వాదాలు తెలిపారు. అభివృద్ధి, సంక్షేమ ప‌థ‌కాల‌పై ప్ర‌జ‌ల‌కున్న విశ్వాసానికి ఈ ఫ‌లితాలు నిద‌ర్శ‌న‌మ‌న్నారు. 
 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: