నేడు మదర్స్ డే కావడంతో ఎంతో మంది ప్రముఖులు వారి తల్లిని గుర్తు చేసుకుంటూ..వారి జీవితాలలో తల్లి పోషించిన మధుర స్మృతులను తలుచుకుంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. తాజాగా మాజీ దిగ్గజ ఆటగాళ్లు సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్ వారి అమ్మలను గుర్తు చేసుకుంటూ ట్విట్టర్ లో పోస్టులు పెట్టారు. " అమ్మ నా గెలుపులో ప్రతి చోట ఉంది. నీ ప్రేమ ఎల్లప్పుడు నా మనసులో చెరిగిపోదు. నేను ఎంత గొప్ప వాడనైనా.. మీ బిడ్డనే " అంటూ సెహ్వాగ్ కవిత్వం రూపంలో తన తల్లికి విషెస్ తెలుపగా.. " మీకు ఎంత వయసు వచ్చిన మీ గురించి ప్రార్థించేది తల్లులే. మీరు ఎల్లపుడూ వారి బిడ్డే.. నా జీవితంలో నన్ను పెంచి పోషించిన ఇద్దరు తల్లులు ఉండడం నాకు ఆశీర్వాదం " అంటూ సచిన్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: