ఒక పక్క సినిమాలు చేస్తూ మరో పక్క రాజకీయాల్లో బిజీగా ఉన్న సినీ నటుడు నందమూరి బాలకృష్ణ కరోనా బాధితుల కోసం కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం అనంతపురం జిల్లాలోని హిందూపురం శాసనసభ్యునిగా వ్యవహరిస్తున్న బాలకృష్ణ ఇప్పటికే తన నియోజకవర్గంలో కరోనాతో బాధపడుతున్న వారి కోసం కొద్ది రోజుల క్రితం ఇరవై లక్షల విలువచేసే కరోనా మందులు పంపిణీ చేసిన సంగతి తెలిసిందే. 

తాజాగా ఆయన కరోనా బాధితుల కోసం మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. హిందూపురం వెళితే తాను బస చేసి గెస్ట్ హౌస్ ని ఇప్పుడు కరోనా బాధితుల కోసం బాలకృష్ణ కేటాయించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు బాలకృష్ణ అభిమానులు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఒక పక్క రాజకీయాల్లో మరో పక్క సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నా సరే తన తల్లి పేరిట నెలకొల్పిన బసవతారకం హాస్పిటల్ ను కూడా చూసుకుంటూ ఆయన బిజీ బిజీగా గడుపుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: