టాలీవుడ్ ప్రిన్స్ మ‌హేశ్ బాబుకు తెలుగులోనే కాకుండా ఇత‌ర భాష‌ల్లోనూ ఎంతోమంది అభిమానులు ఉన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఓ క‌లెక్ట‌ర్ కూడా మ‌హేశ్ బాబును అభిమానిస్తున్నార‌న్న విష‌యం తెలిసింది. గుజ‌రాత్ రాష్ట్రానికి చెందిన ఐపీఎస్ ఆఫీస‌ర్ స‌ఫాన్ హుస్సేన్ సోష‌ల్ మీడియాలో అభిమానుల‌తో ముచ్చ‌టించారు. ఈ సంధ‌ర్బంగా ఓ నెటిజ‌న్ మీకు సౌత్ లో ఇష్ట‌మైన న‌టుడు ఎవ‌ర‌ని ప్ర‌శ్నించాడు. దానికి స‌మాధానం ఇస్తూ తాను సౌత్ లో మ‌హేశ్ బాబును చూసి ఇంప్రెస్ అయ్యాన‌ని అన్నారు. తాను మ‌హేశ్ బాబు సినిమాలు త‌క్కువే చూసినప్ప‌టికీ కొంత‌మంది స‌న్నిహితులు త‌న‌కు మ‌హేశ్ బాబు గురించి చెప్పిన‌ప్పుడు ఆశ్చ‌ర్య‌పోయాన‌ని అన్నారు.

 


మరింత సమాచారం తెలుసుకోండి: