క‌రోనా మ‌హ‌మ్మారిని త‌రిమికొట్టాలంటూ ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో నిర్మించిన ఆల‌యాన్ని కూల్చివేశారు. దీనిపై అధికారులు, గ్రామ‌స్తుల మ‌ధ్య వాద‌న జ‌రుగుతోంది. ప్ర‌తాప్‌గ‌ఢ్ స‌మీపంలోని జూహి షుకుల్‌పూర్ గ్రామంలో ప్రజలు "కరోనా మాత‌" ఆలయాన్ని ఈనెల ఏడోతేదీన నిర్మించారు. ఈ ఆల‌యాన్ని పోలీసులే పడగొట్టారని, ఆల‌యం స్థ‌లంకు సంబంధించిన వివాదంలో ఒక‌రికి మ‌ద్ద‌తుగా ఇలా వ్య‌వ‌హ‌రించారంటూ గ్రామ‌స్తులు ఆరోపిస్తున్నారు. నోయిడా నివ‌సించే లోకేష్‌కుమార్ శ్రీ‌వాస్త‌వ గ్రామ‌స్తుల నుంచి విరాళాలు సేక‌రించి ఈ ఆల‌యాన్ని నిర్మించారు. అదే గ్రామానికి చెందిన రాధేశ్యామ్‌వ‌ర్మను పూజారిగా నియ‌మించారు. ఐదురోజుల వ్య‌వ‌ధిలోనే దేశ‌వ్యాప్తంగా ఈ దేవాల‌యం ప్రాచుర్యం పొందింది. ఆల‌యం నిర్మించిన భూమిలో లోకేష్‌తోపాటు నాగేష్‌కుమార్ శ్రీ‌వాస్త‌, జైప్ర‌కాష్ శ్రీ‌వాస్త‌వకు కూడా వాటా ఉంద‌ని, ఎవ‌రికి మ‌ద్ద‌తుగా ఈ ఆల‌యాన్ని నిర్మించార‌నేది ఇప్ప‌టివ‌ర‌కు తెలియ‌డంలేదంటూ ప్ర‌జ‌లు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: