గ్యాస్ సిలిండ‌ర్‌లో గ్యాస్ త‌ప్ప ఏముంటుంది..? ఏమిటీ ఈ పిచ్చి  ప్ర‌శ్న అని అనుకుంటున్నారా..? అలా అయితే పొర‌పాటే గ్యాస్ సిలిండ‌ర్‌లో గ్యాస్ ఉంటుంద‌ని  అంద‌రూ అనుకుంటారు.  సిలిండ‌ర్ల‌ను బ‌ట్టి గ్యాస్ నింపి ఉంటుంది కానీ గ్యాస్ సిలిండ‌ర్లో గ్యాస్ మాయం అవ్వ‌డం ఎప్పుడైనా చూసారా..? మ‌ర‌ల గ్యాస్ సిలిండ‌ర్‌లో నీళ్లు నింపి ఉండ‌డం అందులో ఆశ్చ‌ర్యం క‌లిగించింది. అనువు అండి ఇది  అక్ష‌రాల నిజం. ఓ వైపు గ్యాస్ ధ‌ర‌లు విప‌రీతంగా పెరిగి సామాన్యుడి పై గుదిబండ‌గా మారిన వేళ గ్యాస్ లోంచి నీళ్లు వ‌స్తే ఆ వినియోగ‌దారుని ప‌రిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకుంటేనే ప‌రిస్థితి దారుణం అనిపిస్తుంది.

గ్యాస్‌ను కొనుగోలు చేసిన వినియోగ‌దారుడి యొక్క విచిత్ర ప‌రిస్థితి ఇది. తాను కొనుగోలు చేసిన గ్యాస్ ఓ వైపు త్వ‌ర‌గా అయిపోవ‌డం.. మ‌ర‌ల గ్యాస్‌కు బ‌దులు నీళ్లు రావ‌డం మ‌రోవైపు ఏమి చేయాలో తెలియ‌ని ప‌రిస్థితి ఆ వినియోగ‌దారునిది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని ప్ర‌కాశం జిల్లా చీరాల మండ‌లం రామ‌కృష్ణ‌పురంకు చెందిన శ్రీ‌నివాస‌రావు గ్యాస్ బుక్ చేసాడు. వేట‌పాలెం గ్యాస్ ఏజెన్సీ నుంచి సిలిండ‌ర్ ఇంటికి వ‌చ్చి డెలివ‌రీ చేసారు. గ్యాస్‌ను వంట గ‌దిలో పెట్టి కొద్ది రోజులు వాడుకోవ‌డం మొద‌లెట్టారు. అయితే విచిత్రం ఏమిటంటే ప‌దిరోజుల్లోనే గ్యాస్ అయిపోవ‌డం జ‌రిగింది. ఏమి జ‌రిగిందో అర్థంకాక గ్యాస్ పైపుతీసి చూడ‌గా.. అందులోంచి గ్యాస్ బ‌దులు నీరు బ‌య‌ట‌కొచ్చింది. వెంట‌నే గ్యాస్ ఏజెన్సీని సంప్ర‌దించారు. కొన్ని సిలిండ‌ర్ల‌లో వ‌ర్షం కార‌ణంగా నీళ్లు వ‌స్తున్నాయ‌ని, వేరే సిలిండ‌ర్ ఇస్తాం అని గ్యాస్ ఏజెన్సీ నిర్వాహ‌కులు చెప్పారు.


మరింత సమాచారం తెలుసుకోండి: