గత రెండేళ్ల క్రితం చైనాలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా ప్రజలను భయాందోళనకు గురి చేస్తోంది. అయితే యావత్ ప్రపంచ దేశాల్లో ఇప్పటికే కరోనా వేరియంట్లు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న విషయం తెలిసిందే. చాలా వేరియంట్ల రూపంలో కరోనా వైరస్ రూపాంతరం చెందుతూ వస్తోంది. ఆల్ఫా, బీటా, ఒమిక్రాన్ వంటి వేరియంట్లు వ్యాప్తి చెందడంతో లక్షల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ తరుణంలోనే ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూకహెచ్ఓ) కరోనా ముగింపు దశపై ఆశాజనక ప్రకటన విడుదల చేసింది.

ఈ ఏడాది జూలై, జూన్ మధ్యలో ప్రపంచ జనాభాలో 70 శాతం మందికి వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి అయితే.. కరోనా పీక్ స్టేజ్ ముగుస్తుందని వెల్లడించారు. ఈ తరుణంలో కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రత తగ్గితే ఈ ఏడాది చివరి నాటికి కరోనా ముగింపు దశకు చేరుకుంటుందని వ్యాఖ్యలు చేసింది. ప్రజలందరూ కచ్చితంగా కోవిడ్ నిబంధనలు పాటించాలని చెబుతున్నారు. కాగా ఆఫ్రికాలో కోవిడ్ వ్యాక్సినేషన్‌పై టెడ్రోస్ అసంతృప్తి వ్యక్తం చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: