ఏపీ సీఎం జగన్ రైతులకు ఓ గుడ్ న్యూస్ చెప్పారు. ఇకపై ఏపీ రాష్ట్రంలో 2  వేల రైతు భరోసా  కేంద్రాల్లో వ్యవసాయానికి ఉపయోగపడే  డ్రోన్లు ప్రవేశపెట్టబోతున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. అంతే కాదు.. ఆర్బీకే పరిధిలో సైన్స్ చదివిన రైతులను పైలట్లుగా గుర్తించబోతున్నారు. ఆర్బీకేలు సమర్థవంతంగా పనిచేయాలంటే వ్యవసాయ రంగంలో మౌలిక సదుపాయాలు చాలా కీలకమైనవని జగన్ అంటున్నారు. ఏడాదిలోగా కచ్చితమైన ఫలితాలు కన్పించాలని ఆయన అధికారులను ఆదేశించారు.


కిసాన్‌ డ్రోన్స్‌ ప్రాజెక్టుపై సీఎం జగన్ సమీక్షించారు.  మొదటగా 2వేల డ్రోన్‌ యూనిట్లు ప్రవేశపెట్టాలని సీఎం జగన్ నిర్ణయించారు. తొలుత 2వేల ఆర్బీకేల దృష్టి పెట్టి అవసరమైన మేరకు డ్రోన్‌ యూనిట్లను పెంచుకోవాలని ఆదేశించారు. ప్రతి మండలంలో కనీసం 4 ఆర్బీకేలను లక్ష్యంగా చేసుకోవాలని సీఎం జగన్ తెలిపారు. ఆర్బీకేల పరిధిలో డ్రోన్‌ పైలట్లను గుర్తించాలని సీఎం జగన్ ఆదేశించారు. రైతుల్లో సైన్స్‌ గ్రాడ్యుయేషన్, ఇంటర్‌ సైన్స్‌ గ్రూపు చదువుకున్న రైతులను గుర్తించాలని సీఎం జగన్ ఆదేశించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: