మంకీ పాక్స్.. కరోనా తర్వాత ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి.. ఇప్పుడు ప్రపంచ దేశాలను కలవరపరుస్తున్న ఈ మంకీ పాక్స్ మహమ్మారి.. మన ఇండియాకూ వచ్చేసింది. ఈ వైరస్ భారత్‌కు విస్తరించిందని కేంద్రం ప్రకటించింది. కేరళలో తొలి మంకీపాక్స్ కేసు నమోదైనట్టు తెలిపింది.  ఈ విషయాన్ని కేరళ ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్ కూడా వెల్లడించారు. యూఏఈ నుంచి ఈ నెల 12న తిరువనంతపురం వచ్చిన వ్యక్తికి మంకీ పాక్స్ సోకినట్లు ఆమె వెల్లడించారు.

ప్రస్తుతం బాధితుడు మంకీపాక్స్ తరహా లక్షణాలతో ఆస్పత్రిలో చేరాడని  కేరళ ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్ తెలిపారు. అతడి నమూనాలను సేకరించి  నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీలో పరీక్షించారు. ఆ పరీక్షల్లో అతడికి మంకీ పాక్స్ సోకినట్లు తేలిందని  కేరళ ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్ వెల్లడించారు. యూఏఈలో ఉన్నప్పుడు మంకీపాక్స్ సోకిన వ్యక్తితో బాధితుడు సన్నిహితంగా మెలిగినట్లు  కేరళ ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్ తెలిపారు. ప్రపంచ ఆరోగ్యసంస్థ, ఐసీఎంఆర్ మార్గదర్శకాల మేరకు జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: