గోదావరి నదికి మళ్ళీ వరద పోటెత్తుతోంది. ధవలేశ్వరం బ్యారేజీ నుంచి 5,50,000  క్యూసెక్కుల వరద నీటిని సముద్రంలోకి విడిచి పెడుతున్నారు. బ్యారేజీ దిగువన ఉన్న కోనసీమ ప్రాంతంలోని చాకలి పాలెం సమీపంలో గల పశ్చిమ గోదావరి జిల్లా కనకాయలంక  కాజ్‌ వే మళ్లీ ముంపు బారిన పడింది.  ఈ వరదల సీజన్లో ఈ కాజ్‌ వే ఇలా వరద ముంపు బారిన పడడం ఇది నాలుగోసారి.  


గోదావరి నదికి మళ్ళీ వరద రావడంతో కోనసీమలోని వశిష్ట వైనతేయ గౌతమి నదిపాయలు జోరుగా ప్రవహిస్తున్నాయి. పి. గన్నవరం డొక్కా సీతమ్మ అక్విడెక్ట్ , కాటన్ అక్విడెక్ట్ ల మధ్య వైనతేయ గోదావరి జోరుగా ప్రవహిస్తుంది. పశ్చిమ గోదావరి జిల్లా అనగారిలంక, పుచ్చలంక ,అయోధ్య లంక , కోనసీమ జిల్లా అరిగెల వారి పేట, జి పెదపూడి లంక, ఊడిముడి లంక, బూరుగులంక గ్రామాల ప్రజలు మర పడవలతోరాకపోకలు సాగిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: