జనసేన రాష్ట్ర కార్యాలయంలో పవన్ కల్యాణ్ ను వివిధ వర్గాల ప్రజలు కలుస్తున్నారు. తమ విజ్ఞప్తులను పవన్ కల్యాణ్ కు తెలియజేస్తున్నారు. ఇటీవల  తమ సమస్యలు పరిష్కరించాలంటూ రేషన్ డీలర్ల సంఘం నాయకులు పవన్ కల్యాణ్ ను కలిశారు. ఆహార భద్రత చట్టానికి వ్యతిరేకంగా రేషన్ విధానం కొనసాగుతోందని పవన్ దృష్టికి తీసుకెళ్లారు. గతంలో సమస్యల పరిష్కారానికి మీ దగ్గరికి వస్తే ప్రభుత్వం వెంటనే 175కోట్లు విడుదల చేసిందని సంఘం నాయకులు పవన్ కు చెప్పారు.

ప్రస్తుతం రేషన్ విధానం అస్తవ్యస్తంగా జరుగుతోందని రేషన్ డీలర్ల సంఘం నాయకులు అన్నారు. ఆహార భద్రత చట్టం ప్రకారం బియ్యాన్ని రేషన్ డీలర్లే పంపిణీ చేయాలని ఇక్కడ మాత్రం అందుకు భిన్నంగా జరుగుతోందని రేషన్ డీలర్ల సంఘం నాయకులు చెప్పారు. గోతాములను ప్రభుత్వం అమ్ముకోవడం వల్ల ఏటా తాము వంద కోట్లు నష్టపోతున్నామనిరేషన్ డీలర్ల సంఘం నాయకులు పవన్ కు వివరించారు. రేషన్ డీలర్ల సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తానని పవన్ వారికి చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: