రిజర్వేషన్లపై ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రిజర్వేషన్లకు సంబంధించి రెండు కీలక బిల్లులను ఏకగ్రీవంగా ఆమోదించింది. దీంతో ఆ రాష్ట్రంలో 76శాతానికి రిజర్వేషన్ల కోటా చేరబోతోంది. ఆమోదించిన బిల్లు ప్రకారం చత్తీస్‌ గఢ్‌లో షెడ్యూల్‌ తెగలకు 32శాతం రిజర్వేషన్లు లభిస్తాయి. ఇతర వెనుకబడిన కులాలకు 27శాతం రిజర్వేషన్లు దక్కనున్నాయి. ఇక షెడ్యూల్‌ కులాలకు 13శాతం రిజర్వేషన్లను చత్తీస్‌ గఢ్‌ ప్రభుత్వం కల్పించింది.


మరో 4శాతం ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చత్తీస్‌ గఢ్‌ప్రభుత్వం  రిజర్వేషన్లు కల్పించింది. ఈ సవరణ బిల్లులను  షెడ్యూల్‌ 9లో చేర్చాలని చత్తీస్‌గఢ్ ప్రభుత్వం  కేంద్రాన్నికోరుతోంది. జనాభా ప్రాతిపదిక ఆధారంగానే రిజర్వేషన్లు కల్పించామని ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం చెబుతోంది. అయితే.. నిర్ధిష్టమైన సమాచారం లేకుండానే ఈ రిజర్వేషన్లు కల్పించారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. సాధారణంగా 50 శాతం రిజర్వేషన్లు దాటకూడదని సుప్రీంకోర్టు పలు కేసుల్లో చెప్పింది. మరి ఈ చత్తీస్‌గడ్‌ రిజర్వేషన్లు అమలవుతాయా..కోర్టుల్లో నిలుస్తాయా అన్నది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: