తెలంగాణలోకాంగ్రెస్‌ అగ్రనేతల ప్రచార హోరు కొనసాగుతోంది. నిన్న ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డిలతోపాటు జైరాం రమేష్‌లు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పాలకుర్తి, హుస్నాబాద్‌, ధర్మపురి నియోజక వర్గాలల్లో ప్రియాంక గాంధీ ప్రచారం చేయాల్సి ఉన్నా.. వాతావరణం అనుకూలించక పాలకుర్తి‌, హుస్నాబాద్ సభలకే పరిమితమయ్యారు. హుస్నాబాద్‌ సభ తర్వాత ఆమె హైదరాబాద్‌ తిరుగుపయనమయ్యారు.


ప్రియాంక గాంధీ ఇవాళ ఖమ్మం జిల్లాలో ఎన్నికల ప్రచారం చేస్తారు. పాలేరు, సత్తుపల్లి, మధిర నియోజక వర్గాలల్లో ప్రియాంక గాంధీ ప్రచారం చేస్తారు. అక్కడ ప్రచారం ముగియగానే గన్నవరం ఎయిర్‌ పోర్టుకు చేరుకుని అక్కడి నుంచి ఢిల్లీకి వెళ్లతారు. నిన్న హైదరాబాద్‌ వచ్చిన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ఎల్బీనగర్‌ నియోజకవర్గంలో కార్నర్‌ సమావేశంలో పాల్గొన్నారు.  కాంగ్రెస్‌ అభ్యర్ది మధుయాస్కీకి మద్దతుగా ఖర్గే ప్రచారం చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: