కేసీఆర్ ఓటమి భయంతో రైతు బంధు నిధులను ఇతర కాంట్రాక్టర్ల బిల్లులు చెల్లింపునకు మళ్లిస్తున్నారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి  ఆరోపిస్తున్నారు. కమీషన్ ల కోసం రైతు బంధు నిధులు కాంట్రాక్టర్లకు ఇస్తున్నారని.. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న అసైన్డ్ మెంట్ భూములను ఇతరుల పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేసే పక్రియ జరుగుతోందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి  ఆరోపించారు. అందుకే ప్రభుత్వ అన్ని లావాదేవీలపై నిఘా పెట్టాలని ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేస్తామని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి  తెలిపారు.


ఇవాళ ఛీఫ్  ఎలక్షన్ అధికారి వికాస్ రాజ్ ను  కలవనున్న టీ కాంగ్రెస్ నేతలు దీనిపై ఫిర్యాదు చేయనున్నారు. ప్రభుత్వ లావాదేవీలపై  విజిలెన్స్ నిఘా పెట్టాలని ఇటు హైదరాబాద్ లో అటు ఢిల్లీ లో ఎన్నికల సంఘం, ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు చేస్తామని.. ఇదే అంశాన్ని జూమ్ మీటింగ్ లో చర్చించి నిర్ణయం తీసుకున్నామని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలిపారు. తాను , భట్టి విక్రమార్క, మహేష్ కుమార్ గౌడ్, తదితరులు ఈసీ ని కలుస్తామని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

kcr