ఇవాళ తిరుపతి, బాపట్ల జిల్లాల్లో  సీఎం వైఎస్‌ జగన్‌ పర్యటన ఉంటుంది. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో క్షేత్రస్ధాయిలో పర్యటించాలని సీఎం వైఎస్‌ జగన్‌ నిర్ణయించారు. ఉదయం 8.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరనున్న సీఎం వైఎస్‌ జగన్‌.. ముందుగా తిరుపతి జిల్లాకు వెళ్తారు. అక్కడ వాకాడు మండలం బాలిరెడ్డి పాలెం వద్ద స్వర్ణముఖి నది కట్ట తెగిన ప్రాంతాన్ని సీఎం వైఎస్‌ జగన్‌ సందర్శిస్తారు. నష్టపోయిన ప్రాంతాల్లో పర్యటించి గ్రామస్ధులు, తుపాను బాధితులతో సీఎం వైఎస్‌ జగన్‌ నేరుగా సమావేశంకానున్నారు.

ఆ తర్వాత  బాపట్ల జిల్లా మరుప్రోలువారిపాలెం చేరుకుని తుపాను బాధితులతో సీఎం వైఎస్‌ జగన్‌ మాట్లాడతారు. ఆ తర్వాత కర్లపాలెం మండలం పాతనందాయపాలెంలో రైతులతో సీఎం వైఎస్‌ జగన్‌ మాట్లాడతారు. ఆ తర్వాత సీఎం వైఎస్‌ జగన్‌ బుద్దాం చేరుకుని తుపాను వల్ల దెబ్బతిన్న వరిపంటలను పరిశీలించి రైతులతో సమావేశం అవుతారు. అనంతరం అక్కడ నుంచి  బయలుదేరి సాయంత్రానికి తాడేపల్లి చేరుకుంటారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: