సీఎం రేవంత్ రెడ్డి తొలిరోజే అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అందులో ఒకటి ఇంద్రవెల్లికి చెందినది. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం ఇంద్రవెల్లి గ్రామం -బి లో ఉన్న అమరవీరుల స్తూపం వద్దగల స్మృతి వనం సుందరీకరణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఈ ప్రాంతం అభివృద్ధికి ఒక ఎకరం భూమి కేటాయింపునకు సంబంధించిన జిఓను సీఎం రేవంత్ రెడ్డి తొలిరోజే జారీ చేయించారు. దీనిపై వెంటనే చర్యలు తీసుకొవసిందిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ జిలా కలెక్టర్ ను నిన్న ఆదేశించారు.


ఇంతకీ ఈ ఇంద్రవెల్లి ఏంటి అనుకుంటున్నారా.. దాదాపు 30 ఏళ్ల క్రితం ఇంద్రవెల్లిలో ప్రజాసంఘాలు నిర్వహించుకుంటున్న సభపై అప్పట్లో పోలీసులు దారుణంగా కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో పదుల సంఖ్యలో ఉద్యమ కారులు ప్రాణాలు కోల్పోయారు. ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి  ఇంద్రవెల్లిలోనే తొలి డిక్లరేషన్ ప్రకటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: