తెలంగాణ, ఆధ్రప్రదేశ్ నుంచి శబరిమలైకి వెళ్లే లక్షలాది మంది అయ్యప్ప స్వాములను కేరళ సర్కారు తీవ్ర ఇబ్బందులు పెడుతోందని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ విమర్శించారు. కేరళ ప్రభుత్వం హిందూ వ్యతిరేకమైందని.. అయ్యప్ప స్వాములను ఇబ్బందులకు గురిచేస్తోందని ఆగ్రహాం వ్యక్తం చేశారు. అయ్యప్పలకు త్రాగునీరు, పార్కింగ్ సదుపాయం కూడా కల్పించట్లేదని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ విమర్శించారు. అయ్యప్ప భక్తులు కేరళలో కనీస వసతులు లేక తీవ్ర అవస్థలు పడుతున్నారన్నారు. స్వాములుకు అన్నప్రసాదం చేద్ధామన్నా కేరళ ప్రభుత్వం అనుమతి ఇవ్వడం లేదని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ మండిపడ్డారు.


కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంచి సంబంధాలు ఉన్నాయి కాబట్టి.. పినరయి విజయన్‌తో మాట్లాడి భోజన వసతి, త్రాగునీరు సదుపాయిం కల్పించాలని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ విజ్ఞప్తి చేశారు. దిల్లీ తరహాలో కేరళలో కూడా తెలంగాణ భవన్‌ ను ఏర్పాటు చేయాలని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ డిమాండ్‌ చేశారు. ఐదు నుంచి పదిహేను ఎకరాల స్థలం తీసుకోని తెలంగాణ భవన్‌ నిర్మిస్తే అక్కడ స్వాములు బస చేసేందుకు అవకాశం ఉంటుందన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: