బ్యాంకు కి సంబంధించిన ఓటీపీలు, ఎస్ఎంఎస్ లు ఇప్పుడున్న ఫార్మాట్ లో పంపించడం వల్ల సైబర్ నేరగాళ్లకు డబ్బులు కొట్టేయడం చాలా సులువు అవుతోంది. అందుకే ప్రస్తుత ఫార్మాట్ ని మార్చేసి సరికొత్త ఫార్మాట్ ని అందుబాటులోకి తేవాలని ట్రాయ్ సంస్థ ఎప్పటినుంచో ప్రయత్నిస్తుంది. కానీ బ్యాంకు సంస్థలు కొత్త ఫార్మాట్ ని అప్ డేట్ చేసుకునే విషయంలో ఆలస్యం చేస్తున్నాయి. దీనితో ట్రాయ్ ఏప్రిల్ 1 లోపు అప్డేట్ చేసుకోవాలని లేకపోతే అప్ డేట్ చేసుకునేంత వరకూ SMS, OTP సేవలు నిలిపివేస్తామని హెచ్చరిస్తోంది.