ఇక దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(State bank Of India) అదిరిపోయే ఆఫర్ ని ప్రకటించింది. యోనో(Yono App) యాప్ ద్వారా 'రియల్ టైం ఎక్స్‌ప్రెస్ క్రెడిట్‌' అనే ఫీచర్‌ను ఈ బ్యాంక్ ప్రవేశపెట్టింది.ఇక ఈ యాప్ ద్వారా బ్యాంకు సంబంధిత బ్రాంచ్‌కు వెళ్లకుండానే ఇంటి దగ్గర నుంచే పర్సనల్ లోన్‌ను పొందొచ్చు. వ్యక్తిగత రుణం కోసం రియల్ టైం ఎక్స్‌ప్రెస్ క్రెడిట్ తీసుకోవాలనుకునేవారు ఈ యోనో యాప్ ద్వారా అప్లయ్ చేసుకోవాలి. అలాగే లోన్ కి అర్హులైన కస్టమర్లకు డిజిటల్ పద్దతిలో డాక్యుమెంటేషన్ పూర్తయి క్షణాల్లో రూ. 35 లక్షల దాకా వ్యక్తిగత లోన్ అనేది మంజూరు అవుతుంది.ఇక ఖాతాదారులకు సౌలభ్యాన్ని అందించడంతో పాటు వారికి డిజిటల్‌గా సాధికారత కల్పించడమే లక్ష్యంగా ఈ ప్రభుత్వ రంగ బ్యాంకు ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ 'రియల్ టైం ఎక్స్‌ప్రెస్ క్రెడిట్‌'(RTXC) గురించి వివరిస్తూ సోషల్ మీడియా వేదికగా కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓ ప్రకటన విడుదల చేసింది.రియల్ టైమ్ ఎక్స్‌ప్రెస్ క్రెడిట్ కింద కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, డిఫెన్స్ ఇంకా అలాగే సెంట్రల్ ఆర్మ్‌డ్ ఫోర్సెస్‌లో పనిచేసే వారు ఈ ప్రయోజనాన్ని పొందగలరని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. ఇకపై వారు వ్యక్తిగత రుణం కోసం బ్యాంక్‌ను సందర్శించాల్సిన అవసరం లేదని కూడా బ్యాంక్ పేర్కొంది. క్రెడిట్ హిస్టరీ, అర్హత ఇంకా అలాగే డాక్యుమెంటేషన్ మొత్తం రియల్ టైమ్‌లో డిజిటల్‌ పద్దతిలో పూర్తవుతుందని sbi తెలిపింది. అలాగే ఈ లోన్ వడ్డీ రేట్లు కూడా తక్కువని వెల్లడించింది. అలాగే మరోవైపు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) బల్క్ టర్మ్ డిపాజిట్లపై (రూ. 2 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ) వడ్డీ రేటును 40 నుండి 90 బేసిస్ పాయింట్లు పెంచిన సంగతి కూడా తెలిసిందే. ఇక పెరిగిన వడ్డీ రేట్లు మే 10వ తేదీ నుంచి అమలులోకి వచ్చిన విషయం కూడా విదితమే.

మరింత సమాచారం తెలుసుకోండి: