గత కొద్ది కాలంగా అనేక పరిస్థితుల కారణంగా బంగారం ధరలు క్రమ క్రమంగా పెరుగుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. దానితో కొంత మంది మధ్య తరగతి ప్రజలు బంగారం కచ్చితంగా కొనాల్సిన అవసరం ఏర్పడిన కూడా బంగారం ధరలు చూసే భయపడే స్థాయికి బంగారం ధరలు పెరిగిపోయాయి. ఇక అలాంటి తరుణం లో గత రెండు రోజులుగా బంగారం ధరలు కాస్త తగ్గు ముఖం పెట్టాయి. దానితో బంగారం కొనాలి అనుకునే వారికి ఇది కాస్త గుడ్ న్యూస్ అని చెప్పాలి. మరి ఈ రోజు బంగారం మరియు వెండి ధరలు ఎలా ఉన్నాయి ..? అనేది క్లియర్ గా తెలుసుకుందాం.

వరుసగా రెండు రోజు కూడా బంగారం ధరలు తగ్గాయి. ఈ రోజు హైదరాబాద్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి పై 490 రూపాయలు తగ్గింది. దానితో ఈ రోజు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 99280 రూపాయలుగా ఉంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర ఈ రోజు 450 రూపాయలు తగ్గింది. దానితో ఈ రోజు 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర హైదరాబాద్ నగరంలో 91000 గా ఉంది. ఇక మొత్తంగా రెండు రోజుల్లో కలిపి 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ పై 600 రూపాయలు తగ్గింది. ఇక వెండి ధరల విషయానికి వస్తే ఈ రోజు వెండి ధర కిలో కి వెయ్యి రూపాయలు తగ్గింది. దానితో ఈ రోజు వెండి ధర కేజీకి 120000 ఉంది. ఇకపోతే వరుసగా రెండవ రోజు బంగారం ధరలు తగ్గడంతో గత కొంత కాలంగా బంగారం కొనుగోలు చేద్దాం అని చూస్తున్న వారికి ఇది కాస్త ఆనందకరమైన విషయం అని చెప్పవచ్చు. అలాగే బంగారంపై పెట్టు బడులు పెట్టే వారికి కూడా ఇది గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. మరి బంగారం ధరలు ఇలాగే క్రమ క్రమంగా తగ్గుతాయా ..? లేక మళ్ళీ పెరుగుతాయా అనేది చూడాలి. ఏదేమైనా కూడా గత కొంత కాలంగా బంగారం ధరలు భారీగా పెరిగాయి దానితో ప్రస్తుతం బంగారం ధరలు భారీగా ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: