నాటుబాంబు నోట క‌ర‌చుకోవ‌డంతో  పేలుడు సంభ‌వించి పెంపుడు కుక్క అక్క‌డికక్క‌డే మ‌ర‌ణించింది. ఈ సంఘ‌ట‌న గురువారం మ‌ధ్యాహ్నాం మ‌హ‌బూబాబాద్ జిల్లా బ‌య్యారం మండ‌లం వినోభాన‌గ‌ర్ అట‌వీ ప్రాంతంలో జ‌రిగింది. వినోబా నగర్ అటవీ ప్రాంతంలో కొండమీద మల్లయ్య అనే వ్యక్తి నాటు బాంబులు తయారు చేసి తులారాం ప్రాజెక్టు సరిహద్దు ప్రాంతంలో బాంబుల‌ను పెట్టి నిర్ల‌క్ష్యంగా వ‌దిలేశాడు.‌  నీటి కోసం ప్రాజెక్టు దగ్గరికి వస్తున్న వ‌న్య‌ప్రాణుల‌ను వాటిని తాక‌గానే పేలుడు సంభ‌వించి మ‌ర‌ణిస్తున్నాయి. తాజాగా దేవి అశోక్ అనే వ్య‌క్తి  గొర్రెలను మేపడానికి ప్రాజెక్టు పరిసర ప్రాంతానికి వెళ్ళాడు.  త‌న‌తో వ‌చ్చిన పెంపుడు కుక్క  బాంబు వాసనకు వెళ్లి కొరకడంతో పేలుడు సంభ‌వించి అక్కడికక్కడే మృతి చెందింది.


జంతువుల‌ను చంపేందుకు నాటు బాంబుల‌ను వినియోగిస్తున్న వేట‌గాళ్ల‌ను గ‌తంలో ప‌ట్టుకున్నారు. వ‌న్య‌ప్రాణుల‌కు ఆహార రూపంలో నాటు బాంబుల‌ను ఆశ‌చూపి వాటిని చంపేస్తున్నారు. ఇలాంటి సంఘ‌ట‌న‌లు ఖ‌మ్మం, భ‌ద్రాద్రి, వ‌రంగ‌ల్‌, ఆదిలాబాద్‌, క‌రీంన‌గ‌ర్న, న‌‌ల్గొండ జిల్లాల్లో నిత్య‌కృత్యంగా మారింది. కొద్దిరోజుల క్రితం వరంగల్‌ అర్బన్‌ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ వీరభద్రస్వామి ఆలయం సమీపంలో నాటుబాంబు తిని ఒక శునకం మృతి చెంది తునాతునకలైంది. కొత్తకొండలోని ఒక హోటల్లో ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డ‌యింది. అలాగే కర్నూల్ జిల్లాలో దారుణం జరిగింది. నాటు బాంబు పేలి ఏడో తరగతి విద్యార్థి వర కుమార్ మృతి చెందాడు. కర్నూలు జిల్లా అవుకు మండలం చెన్నంపల్లిలో పాఠశాల పక్కన కొందరు నాటు బాంబులను దాచి ఉంచారు.


వాటిని క్రికెట్ బంతులుగా భావించి కుమార్ ఆ బాంబుతో ఆడుకుంటున్న సమయంలో పేలి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వెంటనే అతన్నికర్నూల్ ప్రభుతాసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ కుమార్‌ మృతి చెందాడు. ఇలా నాటుబాంబుల‌కు జంతువులు, మ‌నుషులు కూడా బ‌ల‌వుతున్నారు. అట‌వీ ప్రాంత గ్రామాల్లో వీటి వినియోగం అడ్డు అదుపులేకుండా సాగుతోంది. పోలీసులు నిఘా ఏర్పాటు చేసి త‌యారీదారుల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ప్ర‌జ‌లు డిమాండ్ చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: