అందరు టెక్నాలజీ వెంట పరుగులు పెడుతున్న ఈ రోజుల్లో కూడా మంత్రాలకు చింత కాయలు రాలుతాయ్ అని నమ్ము తున్నారు ఎంతో మంది.ఈ క్రమం లోనే ఎంతో మంది మంత్రాల నెపం తో ఎన్నో దారుణాలకు పాల్పడుతున్నారు. ఇప్పటికీ నరబలి ఇవ్వడం లాంటి ఘటనలు కూడా వెలుగు లోకి వస్తున్నాయ్. ముఖ్యం గా గుప్త నిధులు ఉన్నాయి అంటూ ఎన్నో ప్రాంతాల లో తవ్వకాలకు కూడా పాల్పడు తున్నారు ఎంతో  మంది. ఇక్కడ గుప్త నిధుల కోసం కొంతమంది తవ్వకాలు ప్రారంభించారు.. ఇక నిధి దొరికితే తమ కంటే అదృష్టవంతులు ఎవరూ లేరు అని భావించారు.


 దీంతో ఇక పక్క ప్లాన్ ప్రకారం పూజలు నిర్వహించి గుప్త నిధులు కోసం తవ్వటం  మొదలు పెట్టాడు. కానీ అంతలో పోలీసులు గుప్త నిధుల తవ్వకాలు చేపడుతున్న 11 మందిని పోలీసులు అదుపు లోకి తీసుకున్నారు. మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉండటం గమనార్హం. ఈ ఘటన మంచిర్యాల జిల్లాలు వెలుగు లోకి వచ్చింది. ఇక నిందితుల తో పాటు తవ్వకానికి ఉపయోగించిన వస్తువులను పూజా సామాగ్రిని కూడా స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు భీమిని మండలం పెద్ద పేట గ్రామానికి చెందిన రషీద్ గుప్తనిధుల కోసం తవ్వకాలు చేయడం ప్రారంభించాడు



 అయితే ఈ విషయాన్ని గ్రహించిన పక్కింటి వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలోనే ఇక తవ్వకాలు చేపట్టిన రషీద్ ను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించగా... తీగ లాగితే డొంక కదిలినట్లు అయింది. తన ఇంట్లో గుప్త నిధులు ఉన్నాయనే అనుమానంతో పూజలు జరిపి తవ్వకాల ప్రారంభించినట్లు చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా తనతో పాటు మరికొంత మంది పాల్గొన్నట్లు చెప్పడంతో.. ఇక అదే మండలానికి చెందిన మొత్తం 11 మందిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఇద్దరు పరారీలో ఉన్నారు.  ఈ ఘటన  స్థానికంగా అందరిని భయాందోళనకు గురి చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: