
ఇటీవల ఇద్దరు వివాహితుల మధ్య జరిగిన వాట్సాప్ చాటింగ్ రెండు కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ముత్యం పేట గ్రామానికి చెందిన మౌనిక అనే వివాహిత కొన్ని రోజుల నుంచి మరో వివాహితుడు ప్రశాంత్ అనే వ్యక్తి తో చాటింగ్ చేయడం మొదలు పెట్టింది. కొన్నాళ్ల వరకూ భర్తకు తెలియకుండా ఇలా చాటింగ్ చేస్తూ వచ్చింది. కానీ ఆ తర్వాత ఈ విషయం భర్తకు తెలిసింది. తెలియని వ్యక్తి తో చాటింగ్ చేయవద్దు అంటూ భార్యను మందలించాడు భర్త.
దీంతో భర్త తన పై అనుమానం పెంచుకున్నాడు అంటూ మనస్తాపం చెందిన మౌనిక చివరకు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. అయితే మౌనిక ఆత్మహత్య విషయాన్ని తెలుసుకున్న వాట్సాప్ లో చాటింగ్ చేస్తున్న ప్రశాంత్ చివరికి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు ప్రశాంత్ కి ఒక పాప భార్య ఉండడం గమనార్హం. ఇలా వాట్సాప్ చాటింగ్ లో మితిమీరిన చాటింగ్ ఏకంగా రెండు కుటుంబాలలో తీరని విషాదం నింపింది. ఈ రెండు ఘటనల పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు..