కంటికి నచ్చింది అనుకుంటే ఎంత ఖర్చు అయిన కొనుకుంటారు. డబ్బులు లేకుంటే అప్పు చేసి మరి కొని కోరిక తీర్చుకుంటారు. కానీ నచ్చిన వస్తువులను కొట్టేయడం ఏంటి అసహ్యంగా అనే ఆలోచన అందరికి వస్తుంది కదూ..అవును అండి బాబు మీరు విన్నది అక్షరాల నిజం..ఓ ఇద్దరు ఆడవాళ్ళు వాళ్ళకు నచ్చిన చీరలను ఎంత కష్టమైన కొట్టేస్తారు. అది కూడా ఖరీదైన చీరలను మాత్రమే వాళ్ళు టార్గెట్ చెసుకుంటారు..ఒక ఎరియాకు ఒక షాప్ ను ఎంచుకొని ఉన్న వాటిని చూసుకొని కంటికి తెలియకుండా కొట్టేస్తారు.. ఇప్పుడు వాళ్ళ ఆటలకు పోలీసులు చెక్ పెట్టారు. ఎట్టకేలకు వాళ్ళను అదుపులొకి తీసుకున్నారు. వారి నుంచి పూర్తీ సమాచారాన్ని సేకరించారు.


వివరాల్లొకి వెళితే..హైదరాబాద్ లోని బంజారాహిల్స్, ఆ పరిసర ప్రాంతాల్లోని ఖరీదైన బట్టల షోరూమ్ లలో చీరలు దొంగతనం చేస్తున్న తల్లీకూతుర్లను పోలీసులు పట్టుకున్నారు. వారిని రిమాండ్ కు పంపించారు.హైదరాబాద్ అంబర్ పేటకు చెందిన తల్లి కూతుర్లు వీళ్ళు.ఒకరి పేరు నల్లూరి సుజాత కాగా మరొకరు ఆమె కూతురు నల్లూరి వెంకటలక్ష్మి పావని. వీరిద్దరూ తల్లీకూతుర్లు. అయితే వీరి ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగానే ఉండటంతో విలువైన చీరలను కొనుగోలు చేయడం కష్టంగా మారింది.


దాంతో కోరికను చంపుకోలేక ఇలా దొంగలుగా మారారు.చీరల దొంగతనం విషయంలో ఓ షాపు ఓనర్ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు..షాప్ కు వచ్చిన వాళ్ళ ఫుటెజ్ ను పోలీసులు పరిసీలించారు.మెట్రో స్టేషన్ లో వీరు టిక్కెట్ కొనుగోలు చేసే క్రమంలో వారి వద్ద ఉన్న మెట్రో కార్డ్ ను ఉపయోగించారు. దీని ద్వారానే వారెవరో పోలీసులు అర్థం అయ్యింది. వారి అడ్రస్, మిగితా వివరాలు అన్నీ తెలుసుకున్న పోలీసులు సోమవారం నిందితులను అరెస్ట్ చేశారు..వారి దగ్గర నుంచి 4 లక్షల చీరలను స్వాదీనం చేసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: