మనిషి జీవితం శాశ్వతమైనది కాదు కానీ రేపు బాగుంటుందని ఒక చిన్న ఆశ ఉంటుంది. ఇలా  ఎన్నో ఆశలతో మనిషి జీవితాన్ని గడుపుతున్న సమయంలో ఊహించని ఘటనలు చివరికి ప్రాణాలు తీసేస్తూ ఉంటాయి. అయితే ఎప్పుడు ఎవరి ప్రాణాలు తీయాలన్నది పైవాడు ముందే రాసిపెట్టి ఉంటాడు అని అంటూ ఉంటారు. ఇదంతా ట్రాష్ అని కొంతమంది కొట్టి పారేసిన కొన్ని ఘటనలు చూసిన తరువాత మాత్రం ప్రతి ఒక్కరు ఇది నమ్ముతుంటారు. ఎందుకంటే అభం శుభం తెలియని చిన్నారులు సైతం ఊహించని విధంగా ప్రాణాలు కోల్పోవడం లాంటి ఘటనలు వెలుగులోకి వస్తూ ఉంటాయి.


 అంత సంతోషంగా సాగిపోతుంది అనుకుంటున్న సమయంలో అనుకోని ఘటన లు అందరిని ఉలిక్కిపడేలా చేస్తూ ఉంటాయి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. క్యాబ్ డ్రైవర్ నిర్లక్ష్యంతో ఒక చిన్నారికి అప్పుడే నిండు నూరేళ్ళు నిండిపోయాయి. అప్పటి వరకూ తమ ముందే నవ్వుతూ తిరిగిన కూతురు అంతలోనే విగతజీవిగా మారిపోవడంతో ఆ తల్లిదండ్రుల గుండె పగిలిపోయింది. దీంతో కూతురిని చేతిలో పట్టుకుని బోరున విలపించారు తల్లిదండ్రులకు. ఈ ఘటన నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది. సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం బెక్కల్ గ్రామానికి చెందిన కరుణకర్ - రవలి  దంపతులకు కొడుకు రుషి, కుమార్తె సిరి ఉన్నారు.


 గత ఏడాది నాచారం వలస వచ్చి అన్నపూర్ణ కాలనీ లోని వనదుర్గ  నిలయం లో ఉంటున్నారు. అక్కడే వాచ్మెన్ గా పని చేస్తూ ఉన్నాడు కరుణాకర్. ఈ క్రమంలోనే ఇటీవల సిరి ఆడుకునేందుకు ఇంట్లో నుంచి బయటకు వచ్చింది. అదే సమయంలో మల్కాజ్గిరి విష్ణుపురి కాలనీ రాజీవ్ కుమార్ కారును అన్నపూర్ణ కాలనీ వినియోగదారుని ఎక్కించుకునెందుకు వచ్చాడు. ఈ క్రమంలోనే వెనకాల బాలిక ఉంది అన్న విషయాన్ని గమనించకుండా క్యాబ్ ని రివర్స్ చేస్తాడు. ఈ క్రమంలోనే ఆ చిన్నారి పై నుంచి కారు వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందింది.  ఇక వెంటనే అప్రమత్తమైన స్థానికులు క్యాబ్ డ్రైవర్ ని పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: