దేవుడు ఆడే వింత నాటకంలో మనుషుల జీవితాలు కేవలం కీలు బొమ్మ లాంటిదే అని అంటూ ఉంటారు. అయితే నేటి ఆధునిక సమాజంలో అందరూ ఇది ట్రాష్ అని కొట్టిపారేసిన కొన్ని కొన్ని ఘటనలు చూసిన తర్వాత మాత్రం ఇది నిజమే అని నమ్మకుండా ఉండలేరు.  ఎందుకంటే అంత సంతోషంగా సాగిపోతుంది అనుకుంటున్న సమయంలో ఊహించని విషాదకర ఘటన చివరికి మృత్యువు ఒడిలోకి నెడుతూ ఉంటుంది. ఈ భూమ్మీద నూకలు తినే భాగ్యం లేకపోతే ఎటు నుంచైనా మృత్యువు ముంచుకొస్తుంది అని అంటూ ఉంటారు.


 చూస్తూ ఉంటే ఇది నిజమే అని అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. ఒక విద్యార్థి అనుకోని విధంగా ఊహించని ఘటన జరిగి చివరికి ప్రాణాలు కోల్పోయింది.  బైక్ పై వెనుక కూర్చొని వెళ్తున్న సమయంలో ఆ యువతి వేసుకున్న చున్నీ బైక్ టైర్ లో  చుట్టుకోవడంతో చివరికి కింద పడి అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది. ఈ ఘటన హైదరాబాద్ నగరంలో వెలుగులోకి వచ్చింది. యాచారం మండల కేంద్రానికి చెందిన 18 ఏళ్ల సనా ఇబ్రహీంపట్నం లోని ఓ ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది. ఈ క్రమంలోనే ఇటీవలే తన సోదరుడి ద్విచక్రవాహనంపై కళాశాల నుంచి ఇంటికి తిరిగి వస్తోంది.



 ఈ క్రమంలోనే మార్గమధ్యంలో ఆ యువతి చున్ని వెనక టైర్ లో చుట్టుకుంది. అయితే బైక్ వేగంగా ఉండటంతో ఒక్కసారిగా ఆమె నేలకేసి కొట్టినట్లుగా కిందపడిపోయింది. అప్పటికే అపస్మారక స్థితిలోకి చేరుకుంది. అయితే వెంటనే ఆమెను సమీపంలో ఉన్న ఆసుపత్రికి తరలించారు. చివరికి కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న సదరు యువతి చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పిల్లలు ద్విచక్రవాహనంపై వెళ్ళేటప్పుడు తమ చీరకొంగు లేదా చున్నీ జాగ్రత్తగా పెట్టుకోవాలని లేదంటే టైర్లు చుట్టుకొని ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: