
అయితే ఈ క్రమంలో ఇక్కడ విద్యార్థులు పదో తరగతి పరీక్షల కోసం ఎంతో కష్టపడి చదివారు. లక్షలు రాసి మంచి ర్యాంకు సాధించాలని భావించారు. కానీ అంతలో విధి వారికి ఊహించని పరీక్ష పెట్టింది. ఏకంగా అప్పటివరకు అల్లారుముద్దుగా పెంచిన తల్లి ని కానరాని లోకాలకు తీసుకు వెళ్ళింది. దీంతో ఒకవైపు పరీక్ష రాసి భవిష్యత్తులో నిలబెట్టుకోవాలా.. లేకపోతే తల్లి దగ్గర ఉండి పోవాలా తెలియక ఆ విద్యార్థులు మదన పడిపోయారు. ఒకరికి కాదు ఏకంగా ఇద్దరు విద్యార్ధులకు కూడా ఇలాంటి పరిస్థితి వేర్వేరు సంఘటనల్లో ఎదురైంది.
కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల కేంద్రానికి చెందిన శ్రీనివాస్ శ్రీలత పెద్ద కుమారుడు రాహుల్ పదవ తరగతి పరీక్షలకు సిద్ధమయ్యాడు. ఇటీవలె ఆర్థిక సమస్యల కారణంగా తల్లి శ్రీలత ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. తల్లి మృతి తో రాహుల్ శోకసంద్రంలో మునిగి పోయాడు. అదే రోజు పదవ తరగతి పరీక్ష కూడా రాయాల్సి ఉంది. అయితే తల్లి మృతదేహాన్ని ఇంటి వద్ద ఉండగానే ఇక పరీక్ష రాసేందుకు వెళ్లి వచ్చాడు రాహుల్. కాగా మరో చోట రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం తడగొండ కు చెందిన నిఖిల్ రెడ్డి కరీంనగర్ లోని గంగాధర లో పదో తరగతి చదువుతున్నాడు అతని తల్లి మమత ఆరోగ్యం తో మృతి చెందింది. అదే సమయంలో తన పరీక్ష రాయాల్సి ఉంది. ఇక పరీక్ష రాసి వచ్చి తల్లి అంత్యక్రియలకు హాజరయ్యాడు నిఖిల్ రెడ్డి..