పెళ్లయిన 16 ఏళ్ల తర్వాత వారికి దేవుడి కటాక్షం లభించింది. పండంటి మగబిడ్డ పుట్టాడు. దీంతో వారి ఆనందం మాటల్లో చెప్పలేనిది. ఈ క్రమంలోనే ఒక్కగానొక్క కొడుకుని ఎంతో గారాబంగా పెంచుకుంటూ ఏ కష్టం రాకుండా చూసుకుంటూ ఉన్నారు.అయితే ఇలా పెళ్లైన 16 ఏళ్ల తర్వాత ఒక కొడుకుని ప్రసాదించిన దేవుడు అంతలోనే ఆ కొడుకుని తిరిగిరాని లోకాలకు తీసుకు వెళ్ళాడు. దీంతో ఇక ఆ తల్లిదండ్రులు అరణ్యరోదనగా విలపించారు అనే చెప్పాలి. ఈ విషాదకర ఘటన అందర్నీ కన్నీళ్లు పెట్టించింది.


 ఏకంగా చనిపోయింది అనుకున్న పాము ఆ బాలుడిని కాటువేసే చివరికి ప్రాణాలు పోవడానికి కారణం అయింది. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం లో వెలుగులోకి వచ్చింది. బైరెడ్డి సంతోష్ - అర్చన దంపతుల కుమారుడైన రెండేళ్ల నైనిక్ గురువారం వేకువజామున నిద్రలేచి పక్కింటావిడ వద్ద ఆడుకుంటున్నాడు అని చెప్పాలి. అటువైపుగా ఒక విషపూరితమైన పాము రావడంతో దానిని గమనించిన గ్రామస్తులు కర్రలతో కొట్టి చంపారు. ఇక పాము లో కదలికలు లేకపోవడం తో చనిపోయింది అనుకుని పక్కకు జరిపారు. ఇంతలోనే అందరూ అవాక్కయ్యే విధంగా అప్పటివరకు కదలకుండా ఉండిపోయినా పాము ఒక్కసారిగా పైకి లేచి పక్కన నిలబడి ఉన్నా మహిళ చేతిలోని చిన్నారి నైనిక్ ను కాటేసింది. అయితే వెంటనే సదరు బాలుని వాహనంలో రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు  ఎంత ప్రయత్నించినా చివరకు ఆ చిన్నారి ప్రాణాన్ని మాత్రం కాపాడలేకపోయారూ. ఈ క్రమంలోనే చికిత్స పొందుతూ బాలుడు పరిస్థితి విషమించిమృతి చెందడంతో ఇక అల్లారుముద్దుగా పెంచుకుంటున్న కొడుకు ఇక లేడు అన్న విషయాన్ని జీర్ణించుకోలేక పోయారు తల్లిదండ్రులు.. ఈ క్రమంలోనే పదహారేళ్ల తర్వాత ఎన్నో పూజలు చేస్తే పుట్టిన కొడుకు అంతలోనే దూరమవడంతో అరణ్యరోదనగా విలపించారు. ఇక తల్లిదండ్రులు  రోదిస్తున్న తీరు అందరిని కంటతడి పెట్టించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: