పాఠశాలలు ప్రారంభమయ్యాయి. దీంతో స్కూళ్లు కాలేజీల విద్యార్థులు అందరూ కూడా మళ్లీ పుస్తకాలు భుజాన వేసుకుని చదువుకోడానికి వెళ్తున్నారు అన్న విషయం తెలిసిందే. ఇక పాఠశాలల విషయానికి వస్తే స్కూలు ప్రారంభమైన నేపథ్యంలో కొత్త యూనిఫార్మ్స్ కొత్త బుక్స్ పంపిణీ చేసే కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి అన్న విషయం తెలిసిందే. ఇదంతా పక్కన పెడితే పాఠశాలకు తమ పిల్లలను పంపించిన తల్లిదండ్రులు ఎప్పుడైనా స్కూలుకు వెళ్లిన సమయంలో తమ పిల్లలు బాగా చదివేలా చూడండి సార్.. మీ మీద నమ్మకంతోనే మేము పాఠశాలకు పంపిస్తున్నాము.. మా ఆశలన్నీ మా పిల్లల మీద పెట్టుకున్నాము. మీరే కొంచెం పిల్లలు బాగా చదివేలా చూడండి అంటూ బ్రతిమిలాడడం చేస్తూ ఉంటారు.



 ఇప్పటి వరకు ఎంతో మంది తల్లిదండ్రులు ఇలా ఉపాధ్యాయులు తమ పిల్లలపై ప్రత్యేక దృష్టి పెట్టి బాగా చదివేలా చూడాలని ప్రతి మలయాళం చేసి చూసి  ఉంటారు. కానీ ఇక్కడ ఒక విద్యార్థి తండ్రి మాత్రం ప్రవర్తించిన తీరు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.అంతే కాదు ప్రతి ఒక్కరు కూడా అవాక్కయ్యేలా చేస్తూ ఉంది ఈ ఘటన. యూనిఫామ్ డబ్బులు రాలేదని ఆరోపిస్తూ ఒక విద్యార్థి తండ్రి పాఠశాలకు వెళ్లి  ఉపాధ్యాయులను బెదిరించడం మొదలు పెట్టాడు.  అది కూడా ఊరికే కాదు చేతిలో ఒక పెద్ద కత్తి పట్టుకుని అర్ధనగ్నంగా పాఠశాలకు వెళ్లి బెదిరించడంతో ఉపాధ్యాయులు అందరూ ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.


 ఈ ఘటన బీహార్లో వెలుగులోకి వచ్చింది. అరారియా జిల్లాలోని భగవాన్ పూర్ పాఠశాలలో చదువుతున్న ఓ విద్యార్థికి యూనిఫామ్ డబ్బులు రాలేదు. దీంతో 24 గంటల్లో డబ్బులు కావాలని అతని తండ్రి అక్బర్ ఒక పెద్ద కత్తి ని చేతిలో పట్టుకొని అర్ధ నగ్నంగా వచ్చి ఉపాధ్యాయులను భరించాడు. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు ఉపాధ్యాయులు. ఎక్కువ డబ్బులు డిమాండ్ చేస్తున్నాడని.. పాఠశాలలో వస్తువులను దొంగలించి మార్కెట్లో అమ్మేసుకుంటున్నాడని సదరు వ్యక్తిపై ఉపాధ్యాయులు ఫిర్యాదు చేయగా అతని అరెస్టు చేసిన పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: