చాటింగులు మీటింగులు డేటింగ్లు చివరికి పెళ్లిచూపులు పెళ్ళిళ్ళు కూడా అన్ని  నేటి రోజుల్లో సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న విషయం తెలిసిందే.  అంతలా సోషల్ మీడియా అందరినీ ప్రభావితం చేస్తోంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇటీవలి కాలంలో ఎంతోమంది  సోషల్ మీడియా వేదికగా గంటల తరబడి గడిపేస్తూ ఉన్నారు. ఇక పక్కనే నేరుగా మాట్లాడే స్నేహితులు ఉన్న ఎందుకో  సోషల్ మీడియా స్నేహితులకు నేటి రోజుల్లో జనాలు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అని చెప్పాలి.  అంతేకాదు నేటి రోజుల్లో సోషల్ మీడియా అనేది నేరాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది. ఫేక్ అకౌంట్లతో చాటింగులు చేస్తూ నకిలీ ఖాతాలతో కవ్వింపులకు  పాల్పడుతూ చివరికి నేరాలు చేస్తూ ఉన్నారు.


 ఇటీవల మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో కూడా ఇలాంటి తరహా ఘటన వెలుగు చూసింది. భార్య పుట్టింటికి వెళ్లడంతో ఒక వ్యక్తి సోషల్ మీడియా లో చాటింగ్ చేయడం మొదలు పెట్టాడు. అవతల వైపు తనతో ఉన్నది  నిజమైన వారా కాదా అని తెలుసుకోకుండానే కాస్త హద్దులు కూడా దాటేశాడు. ఈ క్రమంలోనే మనసులో ఉన్న మాట బయట పెట్టి తన ఇంటికి రావాలని ఒంటరిగా ఉన్నాను అంటూ పిలిచాడు. చివరికి ఆమె ఇంటికి వెళ్ళిన తర్వాత సీన్ చూసి ఒక్కసారిగా నిర్ఘాంతపోయాడు. ఎందుకంటే తాను ఊహించుకుని ఒక అందాల రాసిని కానీ అక్కడికి వచ్చింది మాత్రం ఒక ట్రాన్స్ జెండర్.


 ఈ క్రమంలోనే కోపంతో ఊగిపోయాడు సదరు వ్యక్తి. ట్రాన్స్జెండర్ తో గొడవ పెట్టుకుని కత్తితో దారుణంగా హతమార్చాడు. చివరికి పోలీసులకు పట్టుబడటం తో కటకటాలపాలయ్యాడు. ఖజ్రనా ప్రాంతానికి చెందిన నూర్ మహ్మద్ తన భార్యతో కలిసి నివాసముంటున్నాడు. ఇటీవల భార్య పుట్టింటికి వెళ్లడంతో అతను ఒక్కడే ఇంట్లో ఉండేవాడు. ఈ క్రమంలో అతను సోషల్ మీడియాలో యువతి తో చాటింగ్ చేస్తూ ఉండేవాడు. చాటింగ్ చేస్తుంది ట్రాన్స్జెండర్ అన్న విషయం తెలియదు.  అందమైన అమ్మాయి తనతో చాటింగ్ చేస్తుంది అనే భ్రమలో ఉన్నాడు. చివరికి వీరి మధ్య చనువు పెరిగిపోయింది. చివరికి ఓ రోజు నేరుగా కలిశారు. కానీ తాను ఇన్నాళ్లు చాట్ చేసింది ట్రాన్స్జెండర్ అని తెలుసుకొని నిర్ఘాంతపోయాడు.  కోపంతో హత్య చేశాడు.  పోలీసులు కేసు నమోదు చేసుకుని  విచారణ చేపడితే నిందితుడు పట్టుబడ్డాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: