ఇటీవల కాలంలో ఆత్మహత్యలు చేసుకోవడం అనేది చాక్లెట్ తిన్నంత ఈజీగా మారిపోయింది అని చెప్పాలి. అవును నేటి రోజుల్లో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూస్తూ ఉంటే ప్రతి ఒక్కరికి కూడా ఇదే అనిపిస్తూ ఉంది. చిన్న చిన్న కారణాలకే మనస్థాపం చెందుతూ చివరికి అక్కడితో జీవితం ఆగిపోయింది అని భావిస్తూ.. బలవన్మరణాలకు పాల్పడుతూ ఉన్నారు. తమ మీదే ఆశలు పెట్టుకున్న కుటుంబం గురించి.. కానీ పిల్లాపాపల గురించి కానీ ఎవరు ఆలోచించడం లేదు. దేవుడు ఇచ్చిన నిండు నూరేళ్ల జీవితాన్ని మనుషులే చేజేతులారా అర్ధాంతరంగా ముగించుకుంటున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి అని చెప్పాలి.


 టీచర్ తిట్టిందని.. స్నేహితుడితో గొడవ జరిగిందని తల్లిదండ్రులు బాగా చదువుకోమని మందలించారని.. లేదా మొబైల్ కొనివ్వలేదని ఇలా చిన్నచిన్న కారణాలకే ఎంతోమంది మనస్థాపన చెందుతున్నారు. చివరికి క్షణికావేషంలో నిర్ణయాలు తీసుకుంటూ కుటుంబం మొత్తాన్ని కూడా విషాదంలో నెడుతూ ఉన్నారు అని చెప్పాలి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. భరించలేనంత తలనొప్పి వచ్చింది అన్న కారణంతో  ఒక మహిళ బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన కాస్త స్థానికంగా సంచలనంగా మారిపోయింది.


 ఆమె గత కొంత కాలం నుంచి నరాల బలహీనతతో బాధ పడుతూ ఉంది. ఈ క్రమం లోనే ఇటీవల తీవ్రమైన తలనొప్పి అతని వేధించలేని అయితే తలనొప్పి భరించ లేకపోయిన వార్డు మెంబర్ ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మెదక్ జిల్లా చిలక్ చేయడం మండలం చండూరు గ్రామం లో వెలుగు చూసింది. గ్రామానికి చెందిన సంతోష్ కుమార్ కు కొల్చారం మండలం నవనీత తో వివాహం జరిగింది. కాగా నవనీత  కొంత కాలం నుంచి నరాల బలహీనతతో బాధ పడుతుంది. వైద్యం చేయించుకున్న నయం కాలేదు. చివరికి తలనొప్పి తీవ్రం కావడం తో చివరికి ఆత్మహత్య చేసుకుని తనువు చాలించింది .

మరింత సమాచారం తెలుసుకోండి: