సాధారణంగా విద్యార్థులు పరీక్షలు అంటే చాలు కాస్త భయపడిపోతూ ఉంటారు అని చెప్పాలి. బాగా చదివే విద్యార్థులు కూడా పరీక్షలు వస్తాయి అంటే కాస్త భయం భయంగానే ఇక ఎగ్జామ్స్ కి హాజరవుతూ ఉంటారు. ఇక మరి కొంతమంది విద్యార్థులు తప్పు చేసి అయినా సరే పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలి అనే ఉద్దేశంతో ఇక ఏవేవో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే పరీక్షలు జరుగుతున్న సమయంలో ఒకవైపు ఇన్విజిలేటర్లు ఎంతోక్షుణ్ణంగా ప్రతి ఒక్క విద్యార్థిని గమనిస్తూ ఉన్నప్పటికీ వారి కంటపడకుండా కాపీ కొట్టడం లాంటివి చేస్తూ ఉంటారు స్టూడెంట్స్.


 ఇక ప్రతి ఒక్కరు కూడా వారి విద్యార్థి జీవితంలో ఎప్పుడో ఒకసారి కాపీ కొట్టే ఉంటారు అని చెప్పాలి. అయితే కొంతమంది ఇలా కాపీ కొట్టు ఇన్విజిలేటర్ కి దొరికిపోవడం.. ఇక ఆ తర్వాత వారిని కాళ్ళ నిలబడి వదిలేయమని బ్రతిమిలాడుకోవడం కూడా చేస్తూ ఉంటారు. కొంతమంది విద్యార్థులు కాపీ కొట్టి డిబార్ కావడం కూడా జరుగుతూ ఉంటుంది. అయితే కాఫీ కొట్టడం వల్ల ఇలాంటివి మాత్రం ఇప్పటివరకు జరిగాయ్. కానీ ఇక్కడ మాత్రం కాపీ కొట్టడం కారణంగా ఏకంగా ఒక మర్డర్ జరిగింది అని చెప్పాలి. కాపీ కొట్టడంలో తన అక్కకు సహాయం చేయాలనుకున్న బాలుడు చివరికి దారుణంగా హత్యకు గురయ్యాడు.


 ఈ ఘటన బీహార్ లోని భోజ్పూర్ లో వెలుగు చూసింది. దయ కుమార్ అనే 12 ఏళ్ల బాలుడు 5వ తరగతి చదువుతున్నాడు. అయితే అతడి అక్క ఆరవ తరగతి చదువుతుండగా.. ఇటీవల స్కూల్లో పరీక్షలు నిర్వహించారు. అక్కకు సహాయం చేయాలని ఉద్దేశంతో దయ కుమార్ కిటికీలో నుంచి ఒక చిట్టి విసిరాడు. అది పక్కనున్న మరో బాలిక వద్ద పడింది. దీంతో ఇక ఆ చిట్టి లవ్ లెటర్ గా పోరబడిన ఆమె ఇంటికి వెళ్లి విషయాన్ని తన సోదరులకు చెప్పింది. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన సదరు బాలిక సోదరులు దయ కుమార్ ని ఎత్తుకెళ్లి దారుణంగా కొట్టి రైల్వే ట్రాక్ పై పడేసారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: