పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో ప్రత్యేకమైనది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తమకు నచ్చిన భాగస్వామిని ఎంచుకునేందుకు అన్ని విషయాలు వెనుక ముందు ఆలోచించిన తర్వాతే ముందడుగు వేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. తమ అభిరుచులను అర్థం చేసుకొని తమ ఆలోచనలను గౌరవించే భాగస్వామి దొరికితే అంతకంటే ఇంకేం అదృష్టం ఉంటుంది అని ప్రతి ఒక్కరు భావిస్తూ ఉంటారు. కానీ ఇటీవల కాలంలో పెళ్లి అనేది మాత్రం ఒక కమర్షియల్ ఎలిమెంట్ గా మారిపోయింది అని చెప్పాలి. ఇష్టం ఉంటే పెళ్లి చేసుకోవడం ఇక ఆ తర్వాత ఏదైనా మనస్పర్ధలు వస్తే కోర్టుకు వెళ్లి విడాకులు తీసుకోవడం చకచక జరిగిపోతున్నాయి.


 అయితే ఇటీవల కాలంలో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూసిన తర్వాత నేటి రోజుల్లో అసలు పెళ్లి అనే బంధానికి కాస్తైన విలువ లేకుండా పోతుంది అన్నది మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది అని చెప్పాలి. ముఖ్యంగా త్రిబుల్ తలాక్ బిల్లును అటు కేంద్ర ప్రభుత్వం రద్దు చేసినప్పటికీ కూడా ఇటీవల కాలంలో ఎంతోమంది తమ భార్యలకు తలాక్ చెప్పి చివరికి విడాకులు ఇస్తున్న ఘటనలు కూడా వెలుగు చూస్తున్నాయి. యూపీలోని సంబాల జిల్లాలో కూడా ఇలాంటి ఒక విచిత్ర ఘటన వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి.


 ఒక వ్యక్తికి నాలుగేళ్ల కిందట వివాహం జరిగింది.  కానీ పెళ్లైన కొన్నాళ్లకే భార్యాభర్తలు ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయి అని చెప్పాలి. దీంతో ఇక భర్త పై అలిగిన భార్య పెళ్లయిన కొన్నాళ్ళకి పుట్టింటికి వెళ్ళిపోయింది. ఇక సదరు వ్యక్తి కుటుంబ సభ్యులు ఆమెను మళ్ళీ అత్తారింటికి తీసుకొచ్చేందుకు ప్రయత్నించిన ఫలితం లేకుండా పోయింది. ఈ క్రమంలోనే సదర వ్యక్తి మరో యువతితో ప్రేమలో పడ్డాడు. ఈ క్రమంలోనే నిన్న ఇక సదరు యువతిని పెళ్లి చేసుకున్నాడు. అయితే మొదటి భార్య అక్కడికొచ్చి ప్రశ్నించడంతో పంచాయతీ పెట్టారు. దీంతో పెళ్లయిన రెండు గంటలకే రెండో భార్యకు తలాక్ చెప్పేసి.. తన తమ్ముడికి సదరు మహిళలను ఇచ్చి పెళ్లి చేశాడు. ఈ ఘటన కాస్త సంచలనంగా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: