
ఇటీవల కాలంలో సోషల్ మీడియా మాయలో అందరూ పడిపోతున్న నేపథ్యంలో కలలో కూడా ఊహించని ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. సాధారణంగా టీచర్ వృత్తిని ఎంతో గౌరవంగా భావిస్తూ ఉంటారు ప్రతి ఒక్కరు. ఎందుకంటే టీచర్ వృత్తిలో కొనసాగుతున్న వారు భావి భారత పౌరులను తయారు చేస్తారు అని చెబుతూ ఉంటారు. కానీ ఇటీవల కాలంలో టీచర్లు మాత్రం విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన పోయి నీచాతి నీచంగా ప్రవర్తిస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఇలా విద్యార్థులు పేడదోవ పట్టేందుకు టీచర్లే కారణం అవుతున్నారు అన్న విషయం తెలిసి తల్లిదండ్రులు కూడా షాక్ అవుతున్నారు అని చెప్పాలి.
ఎక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగు చూస్తుంది. ఏకంగా క్లాస్ కి సంబంధించిన గ్రూపులో విద్యార్థులు చదవాల్సిన నోట్స్ పెట్టాల్సిన టీచర్ తన ప్రైవేట్ చిత్రాలను పెట్టింది.. దీంతో ఇక విద్యార్థులు ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారిపోయాయి. ఇక పాఠశాల ప్రిన్సిపాల్ వరకు కూడా ఈ వ్యవహారం వెళ్ళింది అని చెప్పాలి. అయితే ఇలా విద్యార్థులకు అశ్లీల చిత్రాలను పంపిన ఉద్యోగిపై కఠిన చర్యలు తీసుకున్నట్లు ప్రిన్సిపల్ చెప్పుకొచ్చారు. ఈ ఘటనతో అటు తల్లిదండ్రులకు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు అని చెప్పాలి.