ఇటీవల కాలంలో ఎంతోమంది బాగా చదువుకుని సాఫ్ట్వేర్ ఉద్యోగం సాధించి ఇక ప్రతినెలా ఎక్కువ మొత్తంలో జీతం తీసుకుంటే లైఫ్ ఎంతో లగ్జరీగా సాగిపోతుంది అని అందరూ అనుకుంటున్నారు. ఒకసారి సాఫ్ట్వేర్ జాబ్ సాధించామంటే చాలు ఏడాది తిరిగే లోపు లక్షల రూపాయల జీతాన్ని పొందేందుకు అవకాశం ఉంటుందని ఎంతో మంది ఆశపడుతున్నారు. ఈ క్రమంలోనే ఏదో ఒక కోర్స్ నేర్చుకుని ఇక సాఫ్ట్వేర్ జాబుల్లో జాయిన్ అవుతున్నారు అని చెప్పాలి.

 ఈ క్రమంలోనే ఇలా సాఫ్ట్వేర్ జాబులు చేసిన వారు ఆ తర్వాత కాలంలో మాత్రం ఒత్తిడిని తట్టుకోలేక.. చివరికి ఆర్థిక సమస్యలు నేపథ్యంలో జాబ్ మానేయ్యా లేక సతమతమవుతున్న వారు ఉన్నారు. ముఖ్యంగా కరోనా వైరస్ వెలుగులోకి వచ్చిన తర్వాత ఎంతోమంది సాఫ్ట్వేర్లు ఇప్పటికి కూడా ఇంటి నుంచి పని చేస్తూ ఉన్నారు. దీంతో ఆఫీసులో స్నేహితులతో కలిసి పని చేసినట్లుగా ఆహ్లాదకరమైన వాతావరణ లేకపోవడంతో ప్రస్తుతం ఎంతో ఒత్తిడికి గురవుతూ ఉన్నారు అని చెప్పాలి. దీంతో కొంతమంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు బలవన్మరణాలకు పాల్పడుతున్న ఘటనలు కూడా వెలుగుచూస్తున్నాయ్.


 ఇక అనంతపురం జిల్లాలో కూడా ఇలాంటి తరహా ఘటన వెలుగు లోకి వచ్చింది. బొమ్మనహళ్ మండలంకు చెందిన కృష్ణమూర్తికి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు అశోక్ బెంగళూరులోని సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. అయితే ప్రస్తుతం ఇంటి నుంచే పని చేస్తున్నాడు అని చెప్పాలి. పని ఒత్తిడి పెరగడంతో జీవితం పై విరక్తి చెంది.. తరచూ ఒంటరిగా ఉంటూ ఫీల్ అవుతూ ఉండేవాడు. అయితే ఇటీవలే ఒత్తిడి తట్టుకోలేక పురుగులు మందు తాగి ఆత్మహత్య ప్రయత్నం చేసాడు. అయితే కుటుంబ సభ్యులు గమనించి వెంటనే ఆసుపత్రికి తరలించిన ఫలితం లేకుండా పోయింది. అప్పటికే మృతి చెందాడు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: