ఇప్పటికే ఎన్నో రకాల వైరస్ లు ముంచుకొస్తూ మనుషుల ప్రాణాలు తీయడానికి పంజా విసురుతున్నాయి. అయితే ఇలాంటి వైరస్ల నుంచి తప్పించుకొని మనిషి హమ్మయ్య అని ఊపిరి పీల్చుకునే లోపే మరో విధంగా ప్రాణాలు పోతున్న పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని కొన్ని సార్లు మనిషి చేజేతులారా నిర్లక్ష్యమైన డ్రైవింగ్ చేస్తూ రోడ్డు ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పోతూ ఉంటే.. మరికొన్నిసార్లు అంత సంతోషంగా సాగిపోతుంది అనుకుంటున్న సమయంలో సడన్ హార్ట్ ఎటాక్ లు ప్రాణాలు తీస్తూ ఉన్నాయి అని చెప్పాలి. ఇటీవల కాలంలో సడన్ హార్ట్ ఎటాక్ల కారణంగా చూస్తూ చూస్తుండగానే ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు.



 ఇక ఇలాంటి తరహా వీడియోలు కూడా అటు సోషల్ మీడియాలో చాలానే ప్రత్యక్షమవుతూ ఉన్నాయి అని చెప్పాలి. దీంతో ఇక ఈ వీడియోలు చూసిన ఎంతోమంది ప్రాణభయంతోనే ప్రతి రోజును గడిపేస్తూ ఉన్నారు. ఏ క్షణంలో సడన్ హార్ట్ ఎటాక్ వస్తుందో అని భయపడుతున్నారు. ఎందుకంటే ఇటీవల కాలంలో చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు ప్రతి ఒక్కరు కూడా సడన్ హార్ట్ ఎటాక్ల కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారు. దీంతోఇలా సడన్ హార్ట్ ఎటాక్ లు ఎందుకు వస్తున్నాయో కూడా తెలియక అందరూ భయాందోళనలోనే మునిగిపోతున్నారు అని చెప్పాలి.



 ఇక్కడ ఇలాంటి ఒక విషాదకర ఘటన వెలుగులోకి వచ్చింది. క్రికెట్ ఆడుతూ 9వ తరగతి చదువుతున్న 14 ఏళ్ల బాలుడు వేదాంత్ గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అయితే అతన్ని వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటన మహారాష్ట్రలోని పూణే జిల్లాలో వనవడిలో వెలుగులోకి వచ్చింది.  ఎప్పటిలాగానే స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడుతూ ఉన్నాడు వేదాంత్. అయితే ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. స్నేహితులు అతని తండ్రికి విషయం చెప్పడంతో తండ్రి హుటాహుటిన ఆసుపత్రికి తరలించాడు. అయితే పరీక్షించిన వైద్యులు అతను చనిపోయినట్లు నిర్ధారించారు. అతను ప్రాణాలు కోల్పోవడానికి గుండెపోటే కారణమని వైద్యులు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: