తాము ఎలక్షన్లలో గెలిచే వరకు మాత్రమే, ఓటు కోసం మాత్రమే ప్రజలు అన్నట్లుగా ఇప్పుడు రాజకీయాలు ఉంటున్నాయని చాలామంది భావన. అంటే మనిషి ఓటు వేసే అంతవరకు మాత్రమే ఆ మనిషికి విలువ ఉంటుందా అని సందేహం వస్తుంది చాలామందికి. ఎందుకంటే ఒక మనిషి బ్రతికున్నప్పుడు తన మంచి,చెడు తాను మాక్సిమం చూసుకుంటాడు. లేదా తన వాళ్లు చూస్తారు.


అది కాకపోతే ప్రభుత్వమే రేపు మనకు ఓటు వేస్తాడు కదా అని తప్పనిసరి పరిస్థితుల్లో ఖచ్చితంగా చూస్తారు. కానీ అది ఆ మనిషి బ్రతికున్నంత వరకు మాత్రమే. ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుంది అంటే ఇటీవల హైదరాబాదులోని లంగర్ హౌస్ సమీపంలో ఉదయాన్నే జరిగిన సంఘటన దీనికి నిదర్శనం. ఆ ప్రాంతంలో ఒక ఉదయాన ఎవరో ఇద్దరు వ్యక్తులు వచ్చి కొన్ని మూటలు  విసిరిస్తుంటే అది చూసిన ప్రజలు కేకలు వేశారట.


ఆ అరుపులు విని ఆ ఇద్దరు వ్యక్తులు పారిపోయారట. ఆ తర్వాత సీసీ కెమెరా ఫుటేజ్ చూస్తే అక్కడ ఒక సంచిలో తల లేకుండా మిగిలిన బాడీ పార్ట్శ్ మాత్రమే కనిపించాయట. అది అశోక్ అనే ఒక వ్యక్తివి అని తెలిసింది. అయితే  ఆ వ్యక్తిని ఎవరైనా హత్య చేసి ఇలా ముక్కలుగా నరికే పడేశారా అంటే అది కాదన్నట్లుగా తెలుస్తుంది. ఇంతకీ అసలు విషయం ఏంటంటే చనిపోయిన తన అన్న దహన కార్యక్రమాలకి డబ్బు లేక అతని శరీరాన్ని ముక్కలుగా నరికి ఇలా మూటల్లో పెట్టి విసిరేస్తున్నారని తెలిసింది.


ఆ విసిరిన వాళ్ళు కూడా ఆ అశోక్ అనే వ్యక్తి యొక్క తమ్ముడు,చెల్లెలు అని తెలుస్తుంది. కానీ అది నిజమో కాదు పోలీసులు తేల్చుతారు. కానీ అంత్యక్రియలకు డబ్బు లేక ఇలా చేయడం అనేది చాలా దారుణం అని చాలామంది అంటున్నారు తెలిసిన వాళ్ళందరూ. ప్రభుత్వాలైనా ఇలాంటి సందర్భాల్లో వాళ్లకు ఏదైనా చేయాలని వాళ్ళు అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: