ఇటీవల కాలంలో వీధి కుక్కులు ఎంతల స్వైర విహారం చేస్తూ ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దీంతో గడప దాటి ఇంటి బయటకి వెళ్ళాలి అంటేనే భయపడిపోతున్నారు జనాలు. ఎందుకంటే వీధి కుక్కలకు మనుషులకు మధ్య జాతి వైరం కొనసాగుతుందేమో అన్న విధంగానే కుక్కలు ప్రవర్తిస్తున్నాయి. మనుషులను చూస్తే చాలు కోపంతో ఊగిపోతూ దారుణంగా దాడులకు పాల్పడుతున్న ఘటనలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి అని చెప్పాలి. ఇలా కుక్కలు దాడిలో ఎంతో మంది చిన్నారులు, పెద్దలు కూడా తీవ్రంగా గాయపడిన ఘటనలు చాలానే వెలుగులోకి వచ్చాయి. ఇక కొంతమంది చిన్నారుల ఉసురు పోసుకున్నాయి వీధి కుక్కలు.


 అయితే కేవలం ఒక్క రాష్ట్రంలో మాత్రమే కాదు ప్రతి చోట కూడా ఇలాంటి పరిస్థితి నెలకొంది అని చెప్పాలి. దీంతో ఇక వీధి కుక్కల నుంచి ప్రజలకు రక్షణ కల్పించేందుకు అటు అధికారులు కూడా చర్యలు చేపట్టడం చూసాము. అయితే ఇక్కడ మాత్రం మరో విచిత్రమైన ఘటన వెలుగులోకి వచ్చింది. పిచ్చికుక్క ఏకంగా మనుషులపై దాడి చేయడం కాదు లేగ దూడపై దాడి చేసింది. అయితే ఆ  దూడ గేదె దగ్గర పాలు తాగగా.. గేద నుంచి వచ్చిన పాలని ఏకంగా 300 మంది తాగారు. అయితే ఈ విషయం తెలిసి వైద్యులు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు అని చెప్పాలి.  గేదె పాలు తాగిన 300 మందికి టీకా వేశారు.



 ఈ ఘటన తెలంగాణలోని కొమరం భీం జిల్లాలో వెలుగులోకి వచ్చింది. చింతల మానేపల్లిలో పిచ్చికుక్క ప్రజలను హడలెత్తించింది. అయితే అది ఒక దూడను కరవగా పాడి రైతు ఆ దూడకి టీకా వేయించలేదు. పైగా ఆ దూడకు గేద పాలు పట్టించాడు. అంతేకాకుండా పాలను గ్రామంలో విక్రయించాడు ఆ రైతు. అయితే వారం రోజుల కింద  దూడ మరణించింది. దీంతో గేదె పాలు తాగిన వారంతా ఆసుపత్రికి పరుగులు తీశారు. ఈ విషయం తెలుసుకున్న అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ క్రమంలోనే ఆ గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేసి గేదె పాలు తాగిన దాదాపు 300 మందికి టీకాలు వేశారు అని చెప్పాలి.  ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: