సాధారణంగా ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి ప్రభుత్వం ఎన్నో మార్గాల ద్వారా ప్రజలకు చేరు అవుతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కొన్ని ప్రభుత్వాలు ప్రత్యేకంగా సర్వీస్ సెంటర్లను ఏర్పాటు చేసి ఇక ప్రతి ప్రాంతంలో ఉన్న సమస్యలను తెలుసుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు. ఇంకొందరు ఇక సహాయ శిబిరాలను ఏర్పాటు చేసి అవసరమైన పేద ప్రజలకు అండగా నిలబడటం లాంటివి చేస్తూ ఉంటారు అని చెప్పాలి. అయితే ఇక్కడ వరకు అంతా బాగానే ఉన్నప్పటికీ కొంతమంది జనాలు మాత్రం ఇలా పేద ప్రజలకు సహాయం చేయడానికి ప్రభుత్వం పూనుకున్న కార్యక్రమాలలో వింత డిమాండ్లను పెట్టి అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే.


 నాకు అమ్మాయి దొరకడం లేదు.. ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేయండి అంటూ గతంలో కొంతమంది యువకులు ఏకంగా ప్రజా ప్రతినిధులకు లేఖలు పంపించడం సోషల్ మీడియాలో సంచులనంగా మారిపోయింది అని చెప్పాలి. అయితే వారికి వీరికి చెబితే తన సమస్య తీరదు అనుకున్నాడో ఏమో.. ఇక్కడ ఒక యువకుడు మాత్రం ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి మందే ఒక వింత డిమాండ్ పెట్టాడు. ఇది కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి.



 ఇంతకీ ముఖ్యమంత్రి ముందు యువకుడు పెట్టిన విజ్ఞప్తి ఏంటో తెలుసా.. తనకు ఏకంగా ఒక అమ్మాయి కావాలని. వినడానికే షాకింగ్ గా ఉంది కదా.. కానీ రాజస్థాన్లో ఇది నిజంగానే జరిగింది. సీఎం సహాయక శిబిరానికి ఒక వింత విజ్ఞప్తి వచ్చింది. తనకు పెళ్లికూతురును వెతికి పెట్టాలని దౌసా జిల్లా గంగాద్వాడికి చెందిన మహ్వార్ అనే 40 ఏళ్ల వ్యక్తి సీఎం సహాయ శిబిరానికి లేఖ రాశాడు. 40 ఏళ్ళు వచ్చిన ఇంకా పెళ్లి కాలేదు. ఇంట్లో ఒంటరిగా ఉంటున్న అమ్మాయిని వెతికి పెడితే పెళ్లి చేసుకుంటా.. అమ్మాయి సన్నగా 30 నుంచి 40 ఏళ్ల మధ్యలో వయస్సు కలిగి ఉండాలి.. నాయకత్వ లక్షణాలు కలిగి ఉండాలి.. త్వరగా ఇల్లాలని అందించండి అంటూ లేఖలో రాశాడు సదరు వ్యక్తి.

మరింత సమాచారం తెలుసుకోండి: