మసాలా వడలు ఎంత రుచికరంగా వుంటాయో ప్రత్యేకంగా చెప్పే పని లేదు. మసాలా వడలను ఇష్టపడని వారంటూ ఎవరు వుండరు. మసాలా వడలు చాల ప్రసిద్ధమైన, రుచికరమైన స్నాక్ ని దసరా లాంటి సంతోషకరమైన పండగల కాలంలో వీటిని చేసుకుంటారు.మసాలా వడలను తయారు చేయటానికి సెనగ పప్పు, ఇతర మసాలాలు కలిపి వాడతారు. సాధారణంగా ఈ వడలను కర్ణాటక లో ఏదైనా పండుగ సందర్భాలలో తయారు చేస్తారు.కరకరలాడే వడలను శనగపప్పు తో పాటుగా మరికొన్ని పప్పుదినుసులు, సుగంధ ద్రవ్య మసాలాలు వాడటం వలన ఇవి వడలకి నోరూరించే రుచిని అందిస్తాయి . మరి ఈ దసరా కి ఇంకెందుకు ఆలస్యం ?మీరు ఈ రుచికరమైన రెసిపీ ని ఎలా తయారు ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ లో ఎలా చేసుకోవాలో చుడండి.

కావాల్సిన పదార్ధాలు...

ప్రధాన పదార్థం....

1 కప్ రాత్రంతానానబెట్టినవి సెనగ పప్పు

ప్రధాన వంటకానికి....

1 చేతి నిండా కోయబడినవి కొత్తిమీర
అవసరాన్ని బట్టి పసుపు
అవసరాన్ని బట్టి కోయబడినవి కరివేపాకు
అవసరాన్ని బట్టి కోయబడినవి పుదీనా ఆకులు
అవసరాన్ని బట్టి కోయబడినవి ఆకుపచ్చని పచ్చిమిరప కాయలు
కొంచెం తురిమిన అల్లం
అవసరాన్ని బట్టి ఉప్పు

తయారు చేయు విధానం...

మిక్సీ లోకి నానపెట్టుకున్నసెనగ పప్పు మరియు పచ్చి మిరపకాయలు వేసుకొని కచ్చాపచ్చాగా పేస్ట్ తయారు చేసుకోవాలి ( ఈ పేస్ట్ మరి మెత్తగా అవకుండా కచ్చా పచ్చగా ఉండేటట్లు చూసుకోండి. )



గిన్నెను తీసుకోని దానిలో గ్రైండ్ చేసుకున్న పేస్ట్ తో పాటుగా అందులోనే కొత్తిమీర ఆకులు, కరివేపాకు ఆకులు, పసుపు ,పుదీనా ఆకులు మరియు అల్లం తురుము వేసుకొని అన్ని పదార్దాలని చక్కగా కలుపుకోవాలి.



ఒక కాలాయిని తీసుకోని అందులో నూనె పోసుకొని వేడిచేసుకోవాలి. నూనె కాగిన తరువాత, ఇంతకముందు చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని గుండ్రగా వడల ఆకారం లో చేసుకొని కాగుతున్న నూనె లో వేసుకోవాలి. మసాలా వడలను 2 నుంచి 3 నిముషాలు గోల్డెన్ బ్రౌన్ రంగులోకి వచ్చేంత వరుకు బాగా వేయించుకోండి.


అంతే ..మసాలా వడలు రెడీ అయిపోయాయి వీటిని టీ టైం లో సైడ్ స్నాక్ లాగా లేదా ఏదైనా చట్నీలోకి లేదా సాస్ లోకి నంచుకుని తినవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: