ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ కుకింగ్ ఆర్టికల్ చదవండి. శీతాకాలంలో కూరల దుకాణాలు, పండ్ల దుకాణాలు కళకళలాడిపోతూ ఉంటాయి. మనం కూడా కొత్త కొత్త రకాల రుచులు ట్రై చేస్తూ ఉంటాం. శీతాకాలంలో చేసుకోగలిగే కొన్ని వంటల కోసం ఇండియాలో అందరూ ఎదురు చూస్తూనే ఉంటారు. గాజర్ హల్వా కానివ్వండి, మూలీ పరాథా కానివ్వండి, ఇవి తింటే వచ్చే రుచికరమైన అనుభూతే వీరే.
బీట్రూట్ కబాబ్.... బీట్రూట్, తోఫూ కబాబ్స్ ఎంతో ఎనర్జిటిక్ గా ఉంటాయి. పైగా ఇందులో అసలు క్యాలరీలే ఉండవు. ఇందులో కలిపే జీడిపప్పు, ఓట్స్ వల్ల ఈ కబాబ్స్ ఎంతో రుచిగా ఉండడమే కాదు, ఎంతో హెల్దీ కూడా.
మూలీ కోఫ్తా.... ముల్లంగి, కొబ్బరి, వేరుసనగగుళ్ళు, శనగపిండి, గరం మసాలా, ఎండు మిర్చి, ఉల్లిపాయలు, కొత్తిమీర, పచ్చిమిర్చి.. లిస్ట్ చూస్తుంటేనే నోరూరుతోంది కదా.. అదే మరి ఈ మూలీ కోఫ్తా స్పెషాలిటీ. ట్రై చేసి ఎంజాయ్ చేయండి మరి.
గాజర్ హల్వా... డెసర్ట్స్ లో గాజర్ హల్వాది ప్రత్యేకమైన స్థానం. ఈ హల్వా ఎదురుగా కనబడుతుంటే తినకుండా ఉండడం కూడా కష్టమే, అంత రుచిగా ఉంటుందిది. తురిమిన క్యారెట్స్, పాలు, పంచదార, నట్స్ కలిపి చేసే ఈ హల్వా వింటర్ లో తినడానికి అత్యంత అనువైనది.
భార్వన్ గోబి... కాలీఫ్లవర్, చీజ్, కిస్మిస్, దానిమ్మ గింజలు, పచ్చి కోవా కలిపి శనపిండిలో వేయించే ఈ వంటకం చాలా ఫేమస్ డిష్. వింటర్ స్పెషల్స్ లో ముందు చెప్పుకోవాల్సింది దీన్నే.
ఇలాంటి మరెన్నో రుచికరమైన వంటకాల కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి...
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి