అసలే వర్షాలు పడుతున్నాయి కదా. వాతావరణం ఒక్కసారిగా చల్లగా మారిపోయింది. అందుకే వేడి వేడిగా తినాలని చాలా మంది అనుకుంటూ ఉంటారు. అందుకే ఇండియా హెరాల్డ్ వారు చేపలతో కొన్ని రకాల  వెరైటీ వంటకాలను మీకు పరిచయం చేయబోతున్నారు. మరి  ఆలస్యం చేయకుండా ఆ రెసిపీలు ఏంటో చూద్దామా. !

ఫిష్ ఫింగర్స్ :

కావాల్సినవి: చేప ముక్కలు- ఆరు, నూనె- తగినంత, మైదా, కారం, నిమ్మరసం- రెండు చెంచాల చొప్పున, ఉప్పు- తగినంత, బ్రెడ్‌ పొడి- అర కప్పు, అల్లంవెల్లుల్లి ముద్ద, గరంమసాలా,  మిరియాల పొడి- అర చెంచా, గుడ్డు- ఒకటి.

తయారీ: ముందుగా చేప ముక్కలను శుభ్రంగా కడిగి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత చేపముక్కలలో ఉప్పు, కారం, అల్లంవెల్లుల్లి పేస్ట్‌, మిరియాల పొడి, గరంమసాలా, నిమ్మరసం, నూనె వేసి కలిపి కాసేపు నానబెట్టాలి. మరోప్లేట్‌లో మైదా, ఉప్పు, చిల్లీ ఫ్లేక్స్‌ వేసి కలిపి పెట్టుకోవాలి. ఇంకొక గిన్నెలో గుడ్డును బాగా గిలక్కొట్టాలి. చేప ముక్కలను మైదాలో దొర్లించి ఆ తర్వాత గుడ్డు సొనలో ముంచి, చివరకు బ్రెడ్‌ పొడి అద్దాలి. ఇలా తయారుచేసుకున్న వీటిని డీప్‌ ఫ్రై చేసుకోవాలి.

గ్రీన్‌ మసాలా కర్రీ:

కావాల్సినవి: చేప ముక్కలు- అయిదు, నిమ్మరసం- రెండు చెంచాలు, కొత్తిమీర- కప్పు, పుదీనా, పెరుగు- అర కప్పు చొప్పున, పచ్చిమిర్చి, వెల్లుల్లి- అయిదారు చొప్పున, జీలకర్ర, మిరియాలు, గరంమసాలా- చెంచా చొప్పున, నూనె- తగినంత, ఉప్పు- రుచికి సరిపడా.

తయారీ విధానం : ముందుగా చేప ముక్కలకు నిమ్మరసం, ఉప్పు కలిపి కాసేపు పక్కన పెట్టాలి. మిక్సీలో కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర, మిరియాలు, కాస్తంత ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి నూనె పోసి అది వేడయ్యాక తయారుచేసి పెట్టుకున్న కొత్తిమీర మిశ్రమాన్ని వేసి పచ్చి వాసన పోయేవరకు వేయించాలి. అర కప్పు పెరుగు వేసి, కొన్ని నీళ్లు పోసి పదినిమిషాలపాటు ఉడికించాలి. ఇప్పుడు చేప ముక్కలను వేసి చిన్న మంటపై అయిదారు నిమిషాలపాటు ఉడికించాలి. చివరగా గరంమసాలా వేసుకోవాలి.అంతే గ్రీన్ ఫిష్ మసాలా కర్రీ రెడీ అయినట్లే. !



మరింత సమాచారం తెలుసుకోండి: