పన్నీర్ తో రకరకాల వెరైటీ వంటకాలు చేసుకోవచ్చు. అలాగే పన్నీర్ కూడా తినడానికి చాలా రుచికరంగా ఉంటుంది. కూరల్లో మాత్రమే కాకుండా పన్నీర్ తో రైస్ కూడా చేసుకోవచ్చు. చాలా రుచికరంగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మరి పన్నీర్ రైస్ కి కావలిసిన పదార్ధాలు ఏంటో ఒకసారి చూద్దామా.

కావాల్సిన పదార్ధాలు:

200 గ్రామ్స్ పన్నీర్

2 టేబుల్ స్పూన్స్ కారం

1టేబుల్ స్పూన్ టమాటో సాస్

1 టేబుల్ స్పూన్ మిర్చి సాస్

2 tsp నూనె

1 cup పొడిపొడిగా వండుకున్న బాస్మతి రైస్

2 tsp నూనె

ఉప్పు

1/2 tsp వైట్ పెప్పర్

1/2 tsp నల్ల మిరియాల పొడి

1/4 cup కేరట్ సన్నని తరుగు

1/4 cup బీన్స్

1 tsp సోయా సాస్

2 tbsp ఉల్లిపాయలు  

1 టొమోటో

కొత్తిమీర కొద్దిగా

అల్లం వెల్లుల్లి పేస్ట్ -1 టేబుల్ స్పూన్

తయారీ విధానం :

ముందుగా పైన చెప్పిన కూరగాయలన్నిటిని కట్ చేసుకుని ముక్కలుగా పెట్టుకోండి. తరువాత స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టి అందులో నూనె వేసి పన్నీర్ ముక్కలను వేసి ఒక రెండు నిముషాలు వేపండి. తరువాత అందులో కారం, టొమాటో సాస్ వేసి, మిర్చి సాస్ కూడా వేసి వేపి ఒక గిన్నెలోకి తీసేయండి. ఇప్పుడు అదే పాన్ లో మళ్ళీ నూనె పోసి నూనె వేడి అయ్యాక  కేరట్, బీన్స్ తరుగు, ఉల్లిపాయలు, టొమోటో ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్  వేసి పచ్చి వాసన పోయే దాక వేపాలి. తరువాత ముందుగా ఉడికించుకున్న బాస్మతి రైస్ వేసి, వైట్ అండ్ బ్లాక్ పెప్పర్ పొడి కూడా వేయండి. వేపండి. ఇప్పుడు ముందుగా వేపుకున్న పన్నీర్ ముక్కలను కూడా వేసేయండి. రెండు నిముషాలు స్టవ్ మీద ఉంచి కొత్తి మీర వేసి స్టవ్ ఆఫ్ చేయండి. అంతే పన్నీర్ రైస్ రెడీ అయిపోయినట్లే. !



మరింత సమాచారం తెలుసుకోండి: