భార్య భర్తల మద్య తలెత్తున్న గొడవలు సర్దుమనగక పోతే ప్రాణాలను తీసుకొనే వరకూ వెళ్తాయి. ఇలాంటి ఘటనలు ఎక్కువగా వెలుగు చూస్తున్నాయి..చిన్న చిన్న కుటుంబ కలహాల వల్ల ప్రాణాలు పోయిన ఘటన వెలుగు చూసింది.. కుటుంబ కలహాలతో కట్టుకున్న భార్య ను మూడంస్థుల బిల్డింగ్ పైనుంచి తోసేశాడో కీచక భర్త. ఆమె చనిపోయిందని నిర్ధారించుకున్న  అనంతరం తన మరదలిని రమ్మని ఆమె తో పరారైయ్యా డు..



వివరాల్లొకి వెళితే.. ఈ దుర్ఘటన రాజస్థాన్‌ లోని కోటా లో జరిగింది. కోటాకు చెందిన నిషా బైర్వా, హన్స్‌ రాజ్ బైర్వా భార్యా భర్తలు. గత కొంత కాలం గా వారిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో ఆమె తన మేన మామ ఇంటివద్ద ఉంటున్నది. అయితే భార్యా భర్తలు ఇద్దరు కలిసి కిరాయికి ఇళ్లు కోసం వెతకడాని కి పట్టణం లోని ఉద్యోగ్ నగర్‌ కు వెళ్లారు. అక్కడ ఓ మూడంతస్థు ల ఇంట్లో రూమ్‌ని చూశారు.



అయితే అక్కడ అంతా నిర్మానుష్యం గా ఉండటం తో అదే అదునుగా భావించిన హన్స్‌రాజ్‌ తన ప్లాన్ ను అమలు చేయాలని భావించాడు. నిషాను బిల్డింగ్ పై నుంచి కిందికి నెట్టేశాడు. అంతెత్తు నుంచి కింద పడిపోవడం తో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. ఆమె మరణించింద ని నిర్ధారించుకున్న అనంతరం.. నిష మరణించిన విషయాన్ని అతని మరదలి కి ఫోన్ చేసి చెప్పాడని, తర్వాత అక్కడి నుంచి పారి పోయాడని పోలీసు అధికారి మహమ్మద్ ఇబ్రహిం చెప్పారు. నిందితుని కోసం గాలిస్తున్నామని, అతనిపై ఐపీసీ సెక్షన్ ల ప్రకారం కేసు నమోదు చేశారు.. పూర్తీ వివరాలు తెలియాల్సి ఉన్నాయి. మరోవైపు ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి ఇప్పట్లో కనుమరుగయ్యేలా లేదు. జనాభాలో 70 శాతం మందికి వ్యాక్సినేషన్ పూర్తయ్యే వరకూ కొవిడ్-19 ప్రపంచాన్ని విడిచిపెట్టదని డబ్ల్యూహెచ్ఓ యూరప్ డైరెక్టర్ శుక్రవారం హెచ్చరించారు... 


మరింత సమాచారం తెలుసుకోండి: