కోటి ఆశలతో కొత్త జీవితం లోకి అడుగు పెట్టాలనుకుంది ఆ యువతి.. ఈ క్రమం లోనే ప్రేమించిన వారిని పెళ్లి చేసుకుంటే ఎంతో ఆనందం గా ఉంటాను అని అనుకుంది.. అత్తారింట్లో అందమైన జీవితం ఉంటుంది అని కలలు కంది.. కానీ పెళ్లి జరగడమే  ఆ యువతి జీవితం చింద్రం కావడానికి కారణం అయింది. పెళ్లి చేసుకొని భర్త గా మారి పోయిన వ్యక్తి  ఇక ఆ యువతి జీవితాన్ని సర్వ నాశనం చేసేసాడు. ఏకంగా ఇటీవల ఓ మహిళ పెళ్లికి ముందే భర్త తనపై అత్యాచారం చేశాడని ఇప్పుడు చంపేస్తాను అంటూ బెదిరింపులకు పాల్పడుతున్న పోలీసులను ఆశ్రయించింది.తనకు న్యాయం చేయాలి అంటూ వేడుకుంది ఆ  మహిళ.


పెళ్లికి  ముందు భర్త తనపై అత్యాచారం చేశాడు  అంటూ బసవనగుడి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. కాగా ఇద్దరు కూడా సినిమా రంగం లోనే పనిచేస్తూ ఉండటం గమనార్హం.. సోషల్ మీడియా వేదిక గా వీరిద్దరికీ పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలోనే టీవీలో అవకాశం ఇప్పిస్తాను అంటూ సదరు వ్యక్తి నిర్మించాడు.


 ఇక ఒక  రోజు కలుద్దాము అని పిలిచి లైంగిక దాడికి పాల్పడ్డాడు.. ఇక అంతే కాకుండా అనేక సార్లు కామవాంఛలు తీర్చుకున్నాడు. పెళ్లి చేసుకోవాలని అడగడం తో చివరికి ముఖం చాటేయడం మొదలు  పెట్టాడు. ఇక ఎంతో ఒత్తిడి చేసి పెళ్ళికి ఒప్పించి ఒక గుడిలో ఎవరికీ తెలియ కుండా పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత తనను వేధించడం మొదలు పెట్టాడు. కులం పేరుతో దూషిస్తే అదనపు కట్నం కావాలంటూ దారుణం  గా హింసిస్తున్నాడు. ప్రాణాలు కూడా తీస్తాను అంటూ బెదిరింపులకు పాల్పడుతున్నాడు అంటూ బుల్లితెర నటి తన భర్త పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన ఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: