హైదరాబాద్‌లో చైన్ స్నాచర్ కలకలం రేపుతోంది. హైదరాబాద్‌ లో వరుస చైన్ స్నాచర్  ను ఉమేష్ ఖతిక్ గా  గుర్తించారు పోలీసులు.   ఆరు గంటల ఆరు చైన్ సాంచింగ్ చేశాడు ఉమేష్ ఖతిక్. దీంతో ఆ  చైన్ స్నాచర్ ఉమేష్ ఖతిక్ కోసం ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు.  పోలీసు ల దర్యాప్తులో చైన్ స్నాచర్ ఉమేష్ ఖతిక్ గా గుర్తించారు. ఉమేష్ ఖతిక్ కోసం గుజరాత్, మహారాష్ట్ర అహ్మదాబాద్ వెళ్లాయి హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ & ఎస్ ఓ టి & సెంట్రల్ క్రైమ్ స్టేషన్ పోలీస్ కొన్ని బృందాలు. ఈ నేపథ్యంలోనే... పోలీసుల దర్యాప్తులో కీలక సమాచారం వెలుగులోకి వచ్చింది.  పోలీసులకు సవాల్ విసిరిన స్నాచర్ ఉమేష్ ఖాతిక్ ది  స్వస్థలం రాజస్థాన్. చైన్ స్నాచర్ పై గుజరాత్ , మహారాష్ట్ర  రెండు రాష్ట్రాల్లోనూ పదుల సంఖ్యలో చోరీల కేసులు నమోదు అయ్యాయి. 

రాజస్థాన్ ప్రాంతానికి చెందిన ఇతని కుటుంబం గుజరాత్ లోని అహ్మదాబాద్ లో స్థిర పడ్డారు.  మరో నిందితుడు దీపక్ తో కలిసి గుజరాత్ లో నేరాలకు పాల్పడ్డాడు ఉమేష్ ఖతిక్..  2015 లో తొలిసారిగా అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు చిక్కినట్లు సమాచారం అందుతోంది. హైదరాబాద్ టార్గెట్ చేసుకుని ఈ నెల 18 న నాంపల్లి వచ్చాడు ఉమేష్ ఖతిక్. నాంపల్లిలోని మేజిస్టిక్ హోటల్ లో బస చేశాడు ఉమేష్ ఖతిక్.  హోటల్ రికార్డులో ముంబై నుంచి వచ్చిన ఉమేష్ గా పేరు నమోదు చేయించుకున్నాడు ఉమేష్ ఖతిక్. ఈ నెల 19న బుదవారం ఉదయం నుండి చైన్ స్నాచింగ్ చోరీలు చేశారు ఉమేష్ ఖతిక్.   నిందితుడు ఉమేష్ ఖాతిక్...   మేడిపల్లి చంగిచర్ల వరకు కాలినడకన.. ఆ తర్వాత వరంగల్ నుండి ఇతర రాష్ట్రాలకు వెళ్లినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రస్తుతం నిందితుడు ఉమేష్ ఖతిక్ ఎక్కడ ఉన్నారనే దానిపై పోలీసులు దర్యాప్తు ను ముమ్మరం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: