సమస్య వచ్చినప్పుడు అండగా నిలబడాల్సిన సొంత వాళ్లే.. కాల యముడు గా మారిపోయి కిరాతకంగా హత్యలు చేస్తూ ఉంటే ఇక మానవత్వం ఉంది అని ఎవరు హామీ ఇవ్వగలరు.. ఇలా నేటి రోజుల్లో వెలుగులోకి వస్తున్న ప్రతి ఒక ఘటన మనిషిలో మానవత్వం చచ్చిపోయింది అన్న దానికి నిదర్శనం గా మారిపోతుంది. ఇక ఆ ఘటనలు చూస్తుంటే అటు మనిషి ఆలోచనా తీరు ఎటు పోతుందో కూడా అర్థం కాని విధంగా మారిపోయింది పరిస్థితి. నేటి రోజుల్లో వెలుగులోకి వస్తున్న హత్య ఉదంతాలు ప్రతి ఒక్కరి వెన్నులో వణుకు పుట్టించే విధంగా ఉన్నాయి అని చెప్పాలి.
చిన్నచిన్న కారణాలకే హత్యలు చేస్తుండడం సభ్యసమాజాన్ని ఉలిక్కిపడేలా చేస్తోంది.ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది.. మంచింగ్ కు ఆమ్లెట్ వెయ్యలేదు అనే కారణంతో భార్యను దారుణంగా చంపేశాడు ఇక్కడ భర్త. బీహార్లోని సహిరాయాలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. అజిత్ సింగ్ అనే వ్యక్తి మద్యం తాగి ఇంటికి వచ్చాడు. మంచింగ్ కోసం ఇంటికి కోడిగుడ్లు తీసుకొచ్చాడు.. ఆమ్లెట్ వేయాలని భార్యను కోరాడు. ఈరోజు గురువారం కదా ఆమ్లెట్ తినొద్దు అంటూ భార్య భర్తకు చెప్పింది. ఇంకేముంది అప్పటికే మద్యం మత్తులో ఉన్న అతను కోపంతో ఊగిపోయాడు. గొంతు నులిమి భార్యను హత్య చేశాడు. ఇక సీలింగ్ ఫ్యాన్కు ఉరివేసి ఆత్మహత్య గా చిత్రీకరించాలని అనుకున్నాడు. కానీ పోలీసులు రంగంలోకి దిగడంతో దొరికిపోయాడు..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి