ఇలా పగతో రగిలిపోయి ఇద్దరు సోదరులు చివరికి చెల్లిని దారుణంగా హతమార్చారు. 21 ఏళ్ల యువతిని కాల్చిచంపారు. ఈ ఘటనతో స్థానికులు అందరూ ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కాస్త వివరాల్లోకి వెళితే.. బదోన్ జిల్లాలో గత ఏడాది ఓ అమ్మాయి ప్రేమ వివాహం చేసుకుంది. దీంతో ఆమె సోదరులు అందరి ముందు పరువు పోయిందని కోపంతో ఊగిపోయారు. ఇక సొంత చెల్లి పై కక్ష పెంచుకున్నారు. ఇటీవల సదరు యువతి భర్తతో కలిసి బయటికి వెళ్లిన సమయంలో అకస్మాత్తుగా అక్కడికి చేరుకున్న యువకులు తుపాకీతో కాల్చి చంపారు.
దీంతో తీవ్ర భయాందోళనకు గురైన సదరు యువతి భర్త వెంటనే పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఘటనపై ఫిర్యాదు చేశారు. ఇక ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే యువతిని హత్య చేసిన అనంతరం పోలీసులకు దొరక్కుండా తప్పించుకుని తిరుగుతున్నారు ఇద్దరు నిందితులు. ఈ క్రమంలోనే వారిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు పలు బృందాలుగా ఏర్పడి వారి కోసం గాలింపు చర్యలు చేపడితే ఉండటం గమనార్హం..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి