సాధారణం గా కొంత మంది యువకులు తన ప్రేమను గెలిపించుకోవడానికి ఎంత రిస్క్ చేయడానికైనా సిద్ధపడుతూ ఉంటారు. పెద్దలను ఎదిరించడం లాంటివి కూడా చేస్తూ ఉంటారు. పెద్దలను ఎదిరించి ఒక్కటైన వారు నేటి రోజుల్లో చాలా మంది ఉన్నారు అని చెప్పడం లో అతిశయోక్తి లేదు. కొంతమంది ఇలా ప్రేమను గెలిపించుకొని కలకాలం సంతోషం గా ఉంటే మరి కొంత మంది మాత్రం ప్రేమ పేరుతో ఒక్కటై కొన్నాళ్లకే విడిపోతున్న ఘటనలు వెలుగు లోకి వస్తున్నాయి.ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగు లోకి వచ్చింది.


 త్రిపుర రాష్ట్రంలో ఇద్దరు ప్రేమికులు కొత్త జీవితం ప్రారంభించారు. కానీ పెళ్ళయిన కొన్ని రోజులకే చివరికి వారి జీవితం విషాదం గా ముగిసి పోయింది. గోమతి జిల్లా లోని ఆనంద్ చక్మ అనే యువకుడు దలై జిల్లాకు చెందిన యువతి తో ప్రేమలో పడ్డాడు.  యువతి మైనర్ కావడం గమనార్హం.  అటు ఇక ఇంట్లో తెలియకుండా ప్రేమలో మునిగి తేలింది ఆ జంట. ఆ తర్వాత పెళ్లి చేసుకొని ఒక్కటవ్వాలి అనుకుంది. దీంతో ధైర్యం చేసి ఇంట్లో  ప్రేమ వ్యవహారం గురించి చెప్పారు.  కానీ వారు మాత్రం అంగీకరించలేదు. పెద్దలను ఎదిరించి ఓ రోజు ఇంట్లో నుంచి వెళ్లి పెళ్లి చేసుకున్నారు.


 కూతురు కనిపించడం లేదంటూ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చివరికి తెలియకుండా కాస్త అనే గ్రామంలో కాపురం పెట్టారు ఈ కొత్త జంట. ఇక ఇటీవల ఓ సారి స్టేషన్ కు రావాలంటూ పోలీసులు వీరిని పిలిపించారు. దీంతో భయపడిపోయిన ఆ ఇద్దరు ప్రేమికులు ఎక్కడ విడదీస్తారో అని  చివరికి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇద్దరు కలిసి ఇంట్లో విషం తాగారు. ఎంతకీ బయటకు రాకపోవడంతో ఇరుగు పొరుగు వారు వెళ్లి చూసి ఇక పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే తలుపులు బద్దలు కొట్టి వీరిద్దరిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్టు డాక్టర్లు నిర్ధారించారు..

మరింత సమాచారం తెలుసుకోండి: