ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చినా.. ఎంతమంది నేరస్థులను దారుణంగా శిక్షించినా అటు ఆడ పిల్లల పై జరుగుతున్న అఘాయిత్యాలు మాత్రం ఎక్కడా తగ్గడం లేదు అని చెప్పాలి.  రోజురోజుకీ రెచ్చిపోతున్న కామందులు ఆడపిల్ల కనిపిస్తే చాలు దారుణంగా మానవ మృగాలు గా మారిపోతూ అత్యాచారాలకు పాల్పడుతున్న ఘటనలు మహిళల భద్రతను రోజురోజుకూ ప్రశ్నార్థకంగా మార్చేస్తున్నాయి. ఇటీవలి కాలంలో అయితే ఏకంగా వావి వరసలు మరిచి మరి కామవాంఛతో ఊగిపోతూ దారుణాలకు పాల్పడుతూ ఉన్నారు.


 ఇక్కడ ఇలాంటి ఒక అమానవీయ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇటీవలి పాఠాలు చెప్పాల్సిన  ఉపాధ్యాయులు ఏకంగా విద్యార్థుల విషయంలో నీచంగా వ్యవహరిస్తున్నారు. ఇక్కడ ఒక టీచర్ కూడా స్టూడెంట్ ను లైంగికంగా లోబరుచుకున్నాడు. చివరికి గర్భవతిని చేశాడు. సభ్య  సమాజం తలదించుకునే ఈ ఘటన గుజరాత్ లో వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. దాహోడ్ జిల్లాలోని జలధిలో పదిహేడేళ్ళ విద్యార్థిని నైనేష్ దామోరా ఆధ్వర్యంలో నడిచే కోచింగ్ క్లాసులకు వెళ్తూ ఉంది. విద్యార్థినీ బాత్రూమ్ కి వెళ్ళినప్పుడు వీడియో రికార్డ్ చేశాడని బాధితురాలు చెప్పడం గమనార్హం. ఆ వీడియో చూపించి బెదిరించి ఇక సదరు బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడనీ సదరు టీచర్.


 వీడియో ని సోషల్ మీడియా లో అప్లోడ్ చేసి పరువు తీస్తాను అంటూ బెదిరింపులకి పాల్పడి బ్లాక్ మెయిల్ చేసి మరి లైంగిక దాడికి పాల్పడినట్లు బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది అని చెప్పాలి. ఇక ఇలా పలుమార్లు సదరు టీచర్ బాలికపై అత్యాచారం చేయగా చివరికి బాధితురాలు గర్భం దాల్చింది. చివరికి తల్లి దండ్రులకు ఈ విషయం తెలియడం తో నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేసి విచారణ జరుపుతున్నట్లు తెలుస్తోంది. పరీక్షల నిమిత్తం బాలికను ఆసుపత్రికి తరలించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: